Samantha డైవోర్స్ విషయంలో విసిగిపోయా.. ఇంకా ఏముంది? నాగచైతన్య స్ట్రాంగ్ క్లారిటీ

అక్కినేని నట వారసుడు నాగచైతన్య మరోసారి సమంత రుత్ ప్రభుతో విడాకులపై ఘాటుగా స్పందించారు. వారిద్దరూ విడిపోయి సుమారు ఏడాది కాలం అవుతున్నప్పటికీ.. వారి విడాకుల గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు విసిగిపోయారు. ఇటీవల బాలీవుడ్‌కు చెందిన ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతూ ఓ స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు.

సమంత రుత్ ప్రభు, నేను సామరస్యంగా విడిపోయాం. ఒకరంటే మరొకరికి గౌరవం ఉంది. ఇంకా ఆమెతో విడాకుల గురించి మాట్లాడి నేను బోర్ అయిపోయాను. మీడియా అడిగే ప్రశ్నలు విసుగు పుట్టిస్తున్నాయి. ఇంకా ఆ ఘటనపై మాట్లాడాల్సింది ఏమీ లేదు అని నాగచైతన్య తెలిపారు.

Naga Chaitanya given one more time clarity on divorce with Samantha Ruth Prabhu

విడాకుల తీసుకొనే ముందు సామరస్యంగా విడిపోయాం. మేమిద్దరం గౌరవప్రదంగా విడిపోతూ సంయుక్తంగా ప్రకటన చేశాం. ఆమె చేసే పనులు, చేసే సినిమాలపై రెస్పెక్ట్ ఉంది. అలాంటి ఘటన తర్వాత ఏర్పడిన గ్యాప్‌ను మా వ్యక్తిగత పనులతో బిజీగా మారి పూడ్చుకొంటున్నాం. నేను మూడు సినిమాలతో బిజీగా ఉన్నాను. ఆ సినిమా ప్రమోషన్స్‌లో తలమునకలై ఉన్నాను అని చైతూ చెప్పారు.

నేను నా వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితం మధ్య స్పష్టమైన గీతను గీసుకొన్నాను. ఒకదానికి ఒకటి క్లాష్ కాకుండా చూసుకొంటున్నాను అని చైతన్య చెప్పారు. చైతూ నటించిన థ్యాంక్యూ మూవీ ఇటీవల రిలీజైంది. ఆయన నటించిన లాల్ సింగ్ చడ్డా చిత్రం ఆగస్టు 11వ తేదీన రిలీజ్ అవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X