4000 రూపాయలతో 50 కోట్లు సంపాదించిన నాగ చైతన్య.. ఆ చిట్కా ఏంటో తెలుసా?
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పలు షాకింగ్ అంశాల్లో జస్ట్ కొన్ని రోజులు కితమే రాజుకున్న అక్కినేని కుటుంబ కాంట్రవర్సీ పెను దుమారాన్నే రేపింది. కాగా అక్కినేని ఫ్యామిలీ కోసం ఒక్క పరువు నష్టం కోసమే కాకుండా అక్కినేని నాగార్జున వారసుడు అక్కినేని నాగ చైతన్య సైడ్ నుంచి అనౌన్స్ చేసిన రెండో పెళ్లి వార్తలు నుంచి తాను అలాగే తన మాజీ భార్య సమంత పేర్లు కూడా అక్కడ నుంచి ఏదొక రూపంలో ప్రతి రోజు వార్తల్లోనే నిలిచాయి.
కాగా మొన్న జరిగిన షాకింగ్ సంఘటన తెలంగాణ మంత్రి కొండా సురేఖ కామెంట్స్ తో మళ్ళీ అక్కినేని కుటుంబం కోసం అలాగే నాగ చైతన్య, నాగార్జున ఇంకా తమ మాజీ కోడలు సమంత కోసం కూడా వార్తలు స్టార్ట్ అయ్యాయి. ఇలా వీరిపై సంచలన వార్తలు వినిపిస్తున్న తరుణంలో యువ హీరో అక్కినేని నాగ చైతన్య లేటెస్ట్ గా చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో షాకింగ్ గా మారింది.

నాగ చైతన్య తన ఎక్స్ ఖాతాలో (ట్విట్టర్) లో ఒక సడెన్ గా ఓ పోస్ట్ పెట్టాడు. తాను ఎప్పుడో 2013 లో బిట్ కాయిన్ ని 50 డాలర్స్ పెట్టి కొన్నాను ఇప్పుడు అవి 6 మిలియన్ కి చేరుకుంది. సో అది గివ్ అవే ఇద్దామనుకుంటున్నాను మీరేం అంటారు అని పోస్ట్ చేసాడు. దీనితో ఇది ఒక్కసారిగా వైరల్ అయ్యింది. అయితే నాగ చైతన్య లాంటి నటుడు నుంచి ఇలాంటి పోస్ట్ రావడం ఒకింత నమ్మే విధంగానే అనిపించింది.
కానీ ఎక్కడో తేడా కూడా అనిపించింది అని కొందరు అంటున్నారు. అయితే హీరోల కొడుకులు వారి చదువులు జ్ఞానంతో కొత్త విషయాలు తెలుసుకోవడంలో ముందే ఉంటారు. అలా ఎన్నో ఏళ్ళు కితం పుట్టిన వర్చువల్ కరెన్సీపై ఇన్వెస్ట్ చేసాడు అంటే నమ్మొచ్చు. ఒక్క చైతూనే కాదు అప్పుడు కొనుకున్న వారు ఇప్పటికీ ఉంచుకుని ఉంటే భారీ లాభాలు అందుకున్నవారు ఉన్నారు.

సో చైతు కూడా పెట్టాడు అంటే నమ్మొచ్చు కానీ ఇక్కడ మరో మెలిక ఏంటంటే ఈ పోస్ట్ నాగ చైతన్య పెట్టలేదట తన సోషల్ మీడియా ఖాతా హ్యాక్ అయ్యినట్టుగా మరో వెర్షన్ వినిపిస్తుంది. అందుకే ఇలాంటి పోస్ట్ తన నుంచి వచ్చింది అని అంటున్నారు. దీనితో ఇది ఊహించని ట్విస్ట్ అని చెప్పాలి. అయితే నిజంగా ఈ పోస్ట్ పెట్టింది నాగ చైతన్య కాదు తన ఖాతా హ్యాక్ అయ్యింది ఎవరో అలా పోస్ట్ చేశారు.
తర్వాత తన టీం రికవర్ చేసి ఆ పోస్ట్ ని తొలగించారు. దీనితో ప్రస్తుతం తానా ఖాతాలో ఆ పోస్ట్ కనిపించదు. కానీ ఈలోపే చాలా మంది స్క్రీన్ షాట్స్ తీసేసారు. మరి కేవలం 50 డాలర్స్ లో ఇపుడు రేటు ప్రకారం ఏకంగా 50 కోట్లు చైతు ఈజీగా సంపాదించాడు అని చెప్పాలి. కానీ ఈ లోపే అది అబద్దం అని తేలిపోయింది.


Click it and Unblock the Notifications











