twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Naga Chaitanya Upcoming Movies: ఏకంగా నాలుగు సినిమాలతో చైతన్య..మరో డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు!

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోయే హీరోల్లో యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ అదే పంథాను ఫాలో అవుతోన్న అతడు.. వరుస పెట్టి సినిమాలను లైన్‌లో పెడుతుంటాడు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ అక్కినేని హీరో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' అనే సినిమాను చేశాడు. విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. అనివార్య కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఇదిలా ఉండగానే.. మరో రెండు చిత్రాలు చేస్తున్నాడు. ఇప్పుడు మరో దాన్ని లైన్‌లో పెట్టాడు.

    ఇప్పటికే మూడు సినిమాలు చేస్తున్న నాగ చైతన్య.. ఇప్పుడు మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిలిం నగర్‌లో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. అతడు ఎవరో కాదు.. 'భీష్మ'తో భారీ విజయాన్ని అందుకున్న వెంకీ కుడుమల. అవును.. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుందట. యూత్‌ఫుల్ లవ్ స్టోరీలానే ఉంటూ మెసేజ్ ఇచ్చే విధంగా దీన్ని తెరకెక్కించబోతున్నాడని అంటున్నారు. ఇక, ఈ సినిమాతో కలిపి చైతూ నాలుగు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నట్లైంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇవన్నీ ఒకేసారి రావొచ్చు.

    మిస్ యూనివర్స్‌గా మిస్ మెక్సికో ఆండ్రియా.. సత్తా చాటిన భారతీయ అందాల సుందరి

    Naga Chaitanya Green Signal to Venky Kudumula

    ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య.. ప్రయోగాత్మక చిత్రాల దర్శకుడు విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో రాశీ ఖన్నా, మాళవికా నాయర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో హీరోయిన్‌ అవికా గోర్ కీలక పాత్రను పోషిస్తోంది. దీన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. దీనితో పాటే ఆమిర్ ఖాన్ హీరోగా నటిస్తోన్న 'లాల్ సింగ్ చద్దా' అనే హిందీ చిత్రంలోనూ చైతూ కీలక పాత్రను పోషిస్తున్నాడు. దాదాపు ఇందులో 20 నిమిషాల పాటు ఉండే ఓ తెలుగు కుర్రాడి పాత్రను చేస్తున్నాడు. తద్వారా బాలీవుడ్‌లోకి ఇలా ఎంట్రీ ఇస్తున్నాడు.

    English summary
    Akkineni Naga Chaitanya Alredy Doing 3 Movies. and Now He Green Signal to Young Director Venky Kudumula.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X