Don't Miss!
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఎందుకు రా ఇలా.. పేరెంట్స్ లేని మరో అభిమాని పిచ్చికి షాక్ అయిన నాగ చైతన్య
అభిమాని లేనిదే హీరోలు లేరు.. అనే మాట ప్రతి ఒక్క హీరోకు తెలుసు. అందుకే ఫ్యాన్స్ ఏం చేసినా కూడా హీరోలు అంతగా కోప్పడరు. కొన్నిసార్లు అతిగా చేస్తే మాత్రం కొందరు సీనియర్ హీరోలు వెంటనే ఆగ్రహం వ్యక్తం చేయడం చాలా సందర్భాల్లో చూశాం. ఇక నేటితరం అభిమానులు కూడా హీరోల ఓపికకు కాస్త పరీక్ష పెడుతున్నారు. అయినప్పటికీ యువ స్టార్స్ కూల్ గా సర్ది చెప్పుకుంటున్నారు. ఈ మధ్య నాగ చైతన్య కూడా అభిమానుల తీరుకు షాక్ అవుతున్నారు.
పెరుగుతున్న హార్ట్ కోర్ ఫ్యాన్స్
అక్కినేని నట వారసుడు నాగ చైతన్య చాలా కూల్ గా ఉంటాడనేది అందరికి తెలిసిన విషయమే. బాక్సాఫీస్ వద్ద తన స్థాయిని పెంచుకోవడమే కాకుండా హార్డ్ కోర్ ఫ్యాన్ ఫాలోవర్స్ సంఖ్యను కూడా పెంచుకుంటున్నాడు. నాగ చైతన్య సక్సెస్ అవ్వడానికి ఎంత కష్టపడ్డాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మొదటి సినిమా డిజాస్టర్ అయినప్పటికీ స్లోగా తన స్టార్ డమ్ ను పెంచుకున్నాడు.
ఫ్యాన్స్ ఎంతమంది వచ్చినా..
ఇటీవల
కాలంలో
నాగ
చైతన్య
షూటింగ్స్
ఎక్కడ
జరిగినా
కూడా
అభిమానులు
వందల్లో
వస్తున్నారు.
అమ్మాయిలు
అబ్బాయిలు
అని
తేడా
లేకుండా
అందరూ
అక్కినేని
యువ
హీరో
కోసం
ఎగబడుతున్నారు.
గతంలో
చైతూకి
ఫాలోయింగ్
ఈ
రేంజ్
లో
ఉండేది
కాదు.
ఫ్యాన్స్
ఎంతమంది
వచ్చినా
కూడా
చైతు
ఏ
మాత్రం
నో
చెప్పకుండా
వారితో
ఫొటోలు
కూడా
దిగుతున్నాడు.
బ్రిడ్జ్ మీద నుంచి దూకిన అభిమాని
రీసెంట్ గా ఒక అభిమాని చైతన్య కోసం ఏకంగా బ్రిడ్జ్ మీద నుంచి దూకడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిచింది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చైతూ థాంక్యు అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఒక చిన్న నది దగ్గర షూటింగ్ జరుగుతుండగా చైతన్య కోసం అభిమాని ఏకంగా బ్రిడ్జ్ మీద నుంచి నీళ్లల్లోకి దూకేశాడు. ఆ తరువాత అతన్ని పిలిచి చైతూ మాట్లాడాడు.
మరో అభిమాని ప్రేమకు..షాక్
ఇక ఇటీవల మరో అభిమాని ప్రేమను చూసి చైతన్య షాక్ అయ్యాడు. తల్లిదండ్రులు లేని ఓ అనాధ అభిమాని చైతన్య పేరును గుండెలపై పచ్చబొట్టుగా వేసుకున్నాడు. చేతులపై కూడా చైతూ బొమ్మలను వేసుకున్నాడు. అది చూసిన హీరో షాక్ అయ్యాడు. ఎందుకు రా ఇలా.. ఏ సినిమా చూసి ఇలా అయ్యావ్ అంటే.. నేను సినిమాలు చూసి హీరో అవ్వలేదు.. మీ క్యారెక్టర్ అంటే ఇష్టమని చెప్పడంతో చైతన్య కాస్త ఎమోషనల్ అయ్యాడు.
ఆ సినిమాతో బిజీగా
ఏదేమైనా ఈ మధ్య కాలంలో నాగచైతన్యకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక రేంజ్ లో పెరిగిపోతోంది. ఇక నెక్స్ట్ ఈ హీరో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేసిన లవ్ స్టోరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా ఏప్రిల్ 16న రిలీజ్ కానుంది. అలాగే మనం దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ అనే సినిమాతో బిజీగా ఉన్న చైతన్య మరో రెండు సినిమాలను కూడా లైన్ లో పెడుతున్నాడు.