క్లీన్ షేవ్‌లో నాగ చైతన్య.. అదిరిపోయిన లుక్
కింగ్ నాగార్జున ఆరుపదుల వయసు దాటినా కూడా తన కొడుకులకు పోటీగా కనిపిస్తుంటాడు. గ్లామర్‌లో కొడుకు కంటే ఎక్కువ మార్కులు కొట్టేస్తాడు.అయితే నాగ చైతన్య మాత్రం తన కూల్ లుక్‌తో అమ్మాయిల మనసును దోచేస్తుంటాడు. నాగ చైతన్య సాధారణంగా బయట ఎక్కడా కూడా కనిపించడు. సినిమా ఈవెంట్లు, సన్నిహితుల ఇంట్లో శుభకార్యాల్లో మాత్రమే అలా మెరుస్తుంటాడు.
మొన్నటి వరకు నాగ చైతన్య దేవదాస్‌లా గడ్డం పెంచి కనిపించాడు. లవ్ స్టోరీ, విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రాబోతోన్న థాంక్యూ సినిమాలోనూ నాగ చైతన్య గడ్డంతో కనిపించనున్నాడు. ఈ మేరకు బయటకు వచ్చిన పోస్టర్లు బాగానే క్లిక్ అయ్యాయి. అయితే తాజాగా మాత్రం నాగ చైతన్య క్లీన్ షేవ్‌లో కనిపించి ఇంకా కాలేజ్ కుర్రాడేనా? అనిపించేలా ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం నాగ చైతన్య ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అందమంటే అక్కినేని వారి సొంతం అంటూ వారి అభిమానులు పొగడ్తల వర్షం కురిపించారు. మంచు విష్ణు కూడా అదే ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఇద్దరూ కలిసి ఇచ్చిన పోజులు కూడా బాగానే వైరల్ అవుతున్నాయి. మొత్తానికి మజిలీ వంటి చిత్రం తరువాత నాగ చైతన్య లవ్ స్టోరీతో హిట్ కొట్టేందుకు వస్తున్నాడు. విక్రమ్ కే కుమార్ సినిమాలోనూ నాగ చైతన్య వెరైటీ కారెక్టర్‌ను పోషిస్తోన్నట్టు తెలుస్తోంది.



Click it and Unblock the Notifications











