మా విడాకులు కొందరికి కామెడీ..నన్ను నీచంగా టార్గెట్.. నాగచైతన్య సీరియస్
టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్నటువంటి చాలా మంది అగ్ర తారల జంటలు ఉన్నాయి. కాగా వీరిలో చాలా మందికి మోస్ట్ ఫెవరెట్ జంట ఏదన్నా ఉంది అంటే మెయిన్ గా యువతలో ఒకప్పుడు అక్కినేని నాగ చైతన్య అలాగే సమంతల జంట అని చెప్పాలి. కాగా వారి మొదటి సినిమాతోనే ఇద్దరి నడుమ ప్రేమ చిగురించి అది ఎక్కడికో వెళ్ళింది.
ఇలా ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ యువ జంట తర్వాత తెలుగులో మరిన్ని సినిమాలు చేసి టాలీవుడ్ యువతకి ఒక బ్రాండింగ్ కపుల్ గా కూడా నిలిచారు. అలాగే అక్కినేని నాగార్జున కూడా మా అక్కినేని కోడలు అంటూ ఎంతో ఆప్యాయంగా తన షోస్ లో కూడా పాల్గొనేలా చేశారు. కానీ ఏమైందో తెలీదు సీన్ కట్ చేస్తే తమ ఫాన్స్ అందరికీ షాకిచ్చేలా ఇద్దరూ విడాకులు ప్రకటించి బిగ్ ట్విస్ట్ ఇచ్చారు.

కాగా ఈ విడాకులు తర్వాత ఇద్దరి స్వరాలూ కూడా మారాయి. ముఖ్యంగా సమంత సైడ్ నుంచి మాత్రం నాగ చైతన్య మీద ఎన్నోసార్లు సెటైర్స్ అలాగే పలు షాకింగ్ కామెంట్స్ చేసింది. అవి కూడా ఓ రేంజ్ లో వైరల్ గా మారగా మధ్యలో నాగ చైతన్య కూడా ఇన్ డైరెక్ట్ గా పలు సెటైర్స్ వేసేవాడు అని ఇంకొన్ని బయటకి వచ్చాయి.
ఇలా పలు సందర్భాల్లో ఇద్దరు కూడా ఒకరిని ఒకరు పరోక్షంగా ఒకరి మీద ఒకరు కామెంట్స్ చేసుకుంటూ రాగ లేటెస్ట్ గా నాగ చైతన్య తమ విడాకుల విషయంలో పలు హాట్ కామెంట్స్ చేయడం ఇపుడు జరిగింది. సమంతతో తన విడాకులు కోసం మాట్లాడుతూ ఇపుడు అందరికీ మా ఇద్దరి విడాకులు అంటే ఒక ఎంటర్టైన్మెంట్ అంశంలా మారిపోయింది అని..
మేమిద్దరం కూడా ఎంతో గౌరవంగా విడిపోవడం జరిగింది, కానీ ఇప్పటికీ ఈ విషయంలో నన్ను చాలా మంది గిచ్చి మాట్లాడుతున్నట్టు కామెంట్స్ చేస్తుంటారు" అంటూ రీసెంట్ గా ఓ పాడ్ కాస్ట్ లో సీరియస్ కామెంట్స్ ని తాను చేయడం జరిగింది. దీనితో మరోసారి వీరి విడాకులు విషయం చర్చకి దారి తీసింది.
ఇక ఇదిలా ఉండగా నాగ చైతన్య నటించిన లేటెస్ట్ సినిమా "తండేల్" తాజాగా రిలీజ్ కి రాగ ఈ సినిమాలో తన సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటించగా యువ దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించాడు. అలాగే ఈ సినిమా నాగ చైతన్య కెరీర్లో సాలిడ్ ఓపెనింగ్స్ అందుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక సమంత గత ఏడాది లోనే ఒక వెబ్ సిరీస్ లో నటించగా ఇపుడు హిందీలోనే మరిన్ని ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











