Naga Chaitanya: కార్తికేయ 2 దర్శకుడితో నాగ చైతన్య మూవీ.. ఎవ్వరూ ఊహించని పాత్రతో అతని బయోపిక్!

కింగ్ నాగార్జున కుమారుడిగా తెలుగు చిత్రపరిశ్రమకు ఎంట్రీ ఇచ్చాడు నాగ చైతన్య. జోష్ సినిమాతో తెరంగేట్రం చేసిన చైతూ సినీ ఇండస్ట్రీకి వచ్చి 14 ఏళ్లు కావొస్తుంది. ఏ మాయ చేసావే సినిమాతో తొలి హిట్ అందుకున్న చైతూ వివిధ చిత్రాలతో అలరించిందాడు. అయితే వాటిలో హిట్ల కంటే ప్లాపులే ఎక్కువగా ఉన్నాయి.

ఇక ఈ మధ్య వరుసగా పరాజయాలు చవిచూశాడు ఈ అక్కినేని హీరో. థ్యాంక్యూ, లాల్ సింగ్ చద్ధా, కస్టడీ సినిమాలు అనుకున్న రీతిలో ఆడలేదు. ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలని ఎవరూ ఊహించని పాత్రతో సినిమా చేయనున్నాడు నాగ చైతన్య. పూర్తి వివరాల్లోకి వెళితే..

Naga Chaitanya Movie With Chandoo Mondeti In Geetha Arts Banner

బైలింగువల్: అక్కినేని కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య ఇటీవల కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తెలుగు తమిళం బైలింగువల్ ప్రాజెక్ట్ గా స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. మిశ్రమ స్పందనతో బాక్సాఫీస్ వద్ద పరాజయం మూటగట్టుకుంది.

Naga Chaitanya Movie With Chandoo Mondeti In Geetha Arts Banner

యంగ్ డైరెక్టర్: నాగ చైతన్య కానిస్టేబుల్ గా నటించిన కస్టడీ ప్లాప్ కావడంతో అక్కినేని అభిమానులు నిరాశకు గురయ్యారు. తర్వాత వచ్చే సినిమా అయిన మంచి విజయాన్ని అందించాలను కోరుకుంటున్నారు. ఈ క్రమంలో నాగ చైతన్య గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఓ సినిమా చేస్తారని తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించనప్పటికీ ఈ సినిమాకు టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించనున్నాడని టాక్.

Naga Chaitanya Movie With Chandoo Mondeti In Geetha Arts Banner

చాలా పాత పదం: అయితే త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న చైతూ-చందు సినిమా గురించి నిర్మాత బన్నీ వాసు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మూవీ కథ, హీరో పాత్ర తదితర అంశాలు తెలిపారు. "మా బ్యానర్ లో నాగ చైతన్యతో సినిమా ఉంటుంది. అందులో హీరో క్యారెక్టర్ తండేలుగా ఉంటుంది. బోట్స్ నడిపేవారిని తండేలు అంటారు. అది చాలా పాత పదం" అని బన్నీ వాసు పేర్కొన్నారు.

Naga Chaitanya Movie With Chandoo Mondeti In Geetha Arts Banner

ట్విస్టులు.. టర్న్స్: "గుజరాజ్ లోని సూరత్ లో ఓ వ్యక్తి నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథ ఉంటుంది. ఇది ఒక అందమైన ప్రేమ కథ. ఊహించని ట్విస్టులు, టర్న్స్ ఉంటాయి. అలాంటి బోట్ డ్రైవర్ పాత్రలో నాగ చైతన్య నటించనున్నారు. ఈ సినిమా అంతా ఫిషర్ మ్యాన్స్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. దీనికోసం చాలా రీసెర్చ్ చేశాం. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది" అని బన్నీ వాసు చెప్పుకొచ్చారు.

Naga Chaitanya Movie With Chandoo Mondeti In Geetha Arts Banner

హిట్ పడుతుందా: ఇప్పటివరకు నాగ చైతన్య తన ఇమేజ్ కు తగినట్లుగా పాత్రలు కథలు ఓకే చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఇంతవరకు బోట్ డ్రైవర్ వంటి వైవిధ్యమైన పాత్రను పోషించలేదు. అందులోనూ నిజ జీవిత పాత్ర ఆధారంగా రూపొందిస్తున్న మూవీ కావడంతో రా అండ్ రస్టిక్ గా ఉండనుందని అనుకోవచ్చు. మరి కార్తికేయ, కార్తికేయ 2లతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న చందు మొండేటి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ చైతూకి హిట్ ఇస్తుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X