ప్రభాస్ భాగస్వామిగా ఉన్న సంస్థకు నాగ చైతన్య కమిట్మెంట్ ఇచ్చాడా?
'మజిలీ' చిత్రం బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడంతో నాగ చైతన్య మంచి జోష్ మీద ఉన్నాడు. ఈ మూవీ తర్వాత తన మేనమామ వెంకటేష్‌తో కలిసి 'వెంకీ మామ' అనే చిత్రం చేస్తున్న చైతూ తాజాగా మరో మూవీకి కమిటైనట్లు తెలుస్తోంది. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ దీన్ని నిర్మించబోతోందట.
ఈ చిత్రానికి వెంటాద్రి ఎక్స్‌ప్రెస్ ఫేం మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. 'వెంకీ మామ' షూటింగ్ తర్వాత చైతు... శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. దీని తర్వాత మేర్లపాక గాంధీతో చేసే అవకాశం ఉంది.
యువి క్రియేషన్స్ వారు ప్రస్తుతం ప్రభాస్ హీరోగా 'సాహో' చిత్రం చేస్తున్నారు. ఇండియాలోనే అతిపెద్ద యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం దాదాపు రూ. 300 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఆగస్టులో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సంస్థలో ప్రభాస్ కూడా భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే.

'వెంకీ మామ' సినిమా విషయానికొస్తే.. విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న ఈచిత్రంలో పాయల్ రాజ్ పుత్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. కెఎస్ రవీంద్ర (బాబీ) దర్శకుడు. సురేష్ బాబు, టీజీ విశ్వ ప్రసాద్ సంయుక్తంగా సురేష్ ప్రొడక్షన్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బేనర్లో నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఫార్మాలిటీస్ పూర్తయినట్లు తెలుస్తోంది. మైనర్ ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉందట. ఈ మూవీ దసరా సందర్భంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టెనర్ కావడంతో దసరా సందర్భంగా విడుదల చేస్తే మంచి వసూళ్లు వస్తాయనే ఉద్దేశ్యంతో ఇలా డిసైడ్ చేశారట.


Click it and Unblock the Notifications











