నాగ చైతన్య నెక్స్ట్ ఎవరితో.. లిస్ట్ పెద్దగానే ఉంది, కానీ..?
అక్కినేని యువ హీరో నాగ చైతన్య కెరీర్ లో ఇంతవరకు పెద్దగా ప్రయోగాలు చేసింది లేదు. రెగ్యులర్ కమర్షియల్ యాంగిల్స్ లొనే ఎక్కువగా కనిపించాడు. మొదటి సినిమా జోష్ దెబ్బకొట్టడంతో చైతు దాదాపు మాస్ కాన్సెప్ట్ ని దూరం పెడుతూ వస్తున్నాడు. మజిలీ సినిమా సక్సెస్ తరువాత మళ్ళీ అదే తరహలో సక్సెస్ అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే కొత్త సినిమాను పూర్తి చేసిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ కారణంగా ఆ సినిమా రిలీజ్ వాయిదా పడింది. సమ్మర్ ఎండింగ్ లో మంచి టైమ్ చూసుకొని ఆ సినిమాను రిలీజ్ చేయాలని శేఖర్ కమ్ముల ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే ఆ సినిమా తరువాత చైతు ఎవరితో వర్క్ చేస్తాడు అనేది ఇంకా ఫైనల్ కాలేదు.

అసలైతే గీతగోవిందం దర్శకుడు పరశురామ్ తోనే ఒక సినిమా చేయాల్సింది. కానీ అతను మహేష్ కోసం సినిమా చేయడానికి చైతు ప్రాజెక్టును పక్కన పెట్టేశాడు. ఇక మరోవైపు భార్య సమంతతో కలిసి నందిని రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేసే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తున్నప్పటికీ ఇంకా క్లారిటీ రాలేదు. ఫైనల్ గా ఇప్పుడు చైతు లిస్ట్ లో మరో దర్శకుడు చేరాడు. మనం దర్శకుడు విక్రమ్ కె కుమార్ తో నాగ చైతన్య ఒక బిగ్ బడ్జెట్ మూవీ ప్లాన్ చేసుకుంటున్నట్లు టాక్ వస్తోంది.
అయితే విక్రమ్ గతంలో మాదిరిగా సక్సెస్ లు అందుకోవడం లేదు. చివరగా డైరెక్ట్ చేసిన హలో, గ్యాంగ్ లీడర్ సినిమాలు అంతగా వర్కౌట్ కాలేవు. దీంతో ఆయనతో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు అంతగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. అయితే ఇప్పుడు నాగ చైతన్య మాత్రం అతను చెప్పిన ఒక కొత్త స్టోరీకి ఫిదా అయినట్లు తెలుస్తోంది. తప్పకుండా ఆ సినిమాను సమ్మర్ అనంతరం కూల్ గా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడట. మరి చైతు న్యూ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











