twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆమీర్ ఖాన్ మూవీలో ఏఎన్నార్ పాత్రలో నాగ చైతన్య: 70 ఏళ్ల తర్వాత మళ్లీ అదే పేరుతో

    |

    అక్కినేని ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు యువ సామ్రాట్ నాగ చైతన్య. కెరీర్ ఆరంభంలోనే పలు విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఈ యంగ్ హీరో.. చాలా కాలం పాటు పరాజయాలతో పరంపరతో తెగ ఇబ్బందులు పడిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే ''మజిలీ' అనే మూవీ నుంచి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ వెంటనే 'వెంకీ మామ'తో మరో సక్సెస్‌ను అందుకుని ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఒక దాని తర్వాత ఒకటి ఇలా ఎన్నో చిత్రాలను పట్టాలెక్కిస్తున్నాడు.

    Bigg Boss: నాలుగో వారం ఆ ఇద్దరిలో ఒకరు ఔట్.. ఒక్కరోజులో మారిన ఓటింగ్.. టైటిల్ ఫేవరెట్లకు బిగ్ షాక్Bigg Boss: నాలుగో వారం ఆ ఇద్దరిలో ఒకరు ఔట్.. ఒక్కరోజులో మారిన ఓటింగ్.. టైటిల్ ఫేవరెట్లకు బిగ్ షాక్

    వరుస విజయాలతో దూసుకుపోతోన్న నాగ చైతన్య.. ఇటీవలే 'లవ్ స్టోరీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది. ఎన్నో అంచనాల నడుమ గత వారమే ఇది విడుదలైంది. అందుకు తగ్గట్లుగానే దీనికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో పాటు కలెక్షన్లు కూడా ఓ రేంజ్‌లో వసూలు అవుతున్నాయి. దీంతో ఇప్పటికే 'లవ్ స్టోరీ' మూవీ పలు రికార్డులను సైతం బద్దలు కొట్టేసింది. అంతేకాదు, బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు చేరువగా కూడా వచ్చేసింది.

    Naga Chaitanya Play Balaraju Role in Aamir Khan Laal Singh Chaddha Movie

    'లవ్ స్టోరీ'తో పాటే అక్కినేని నాగ చైతన్య.. 'థ్యాంక్యూ' అనే సినిమాలోనూ నటించాడు. విలక్షణ చిత్రాల దర్శకుడు విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తైపోయింది. దీనితో పాటు ఈ అక్కినేని హీరో ఇప్పుడు తన తండ్రి నాగార్జునతో కలిసి 'బంగార్రాజు' అనే చిత్రంలో నటిస్తున్నాడు. కల్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ 'సోగ్గాడే చిన్ని నాయన'కు ప్రీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఇది రెండు షెడ్యూళ్లను కూడా కంప్లీట్ చేసేసుకుంది. ఇప్పుడు మరో షెడ్యూల్ కూడా మొదలైపోయింది.

    షర్ట్ విప్పేసి షాకిచ్చిన బిగ్ బాస్ సరయు: బ్రాతో ఘాటు ఫోజులిస్తూ.. వామ్మో చూస్తే తట్టుకోలేరుషర్ట్ విప్పేసి షాకిచ్చిన బిగ్ బాస్ సరయు: బ్రాతో ఘాటు ఫోజులిస్తూ.. వామ్మో చూస్తే తట్టుకోలేరు

    ఏక కాలంలో రెండు మూడు సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతోన్న అక్కినేని నాగ చైతన్య... ఇటీవలే ఓ బాలీవుడ్ చిత్రంలోనూ నటించాడు. అదే ఆమిర్ ఖాన్ నటిస్తోన్న 'లాల్ సింగ్ చద్దా'. ఇందులో దాదాపు 20 నిమిషాల పాటు ఉండే ఓ తెలుగు కుర్రాడి పాత్రను పోషిస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్‌ను కూడా అతడు పూర్తి చేసుకున్నాడు. ఇక, ఇందులో నాగ చైతన్య పాత్ర చనిపోతుందని ఇప్పటికే ఓ న్యూస్ లీకైంది. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో అతడి పాత్ర పేరు బాలరాజ్ అని తెలిసింది. కాకినాడ సమీపంలోని ఓ గ్రామ వాస్తవ్యుడిగా చైతూ నటించాడట.

    1948లో అక్కినేని నాగేశ్వర్రావు 'బాలరాజు' అనే టైటిల్‌తో ఓ సినిమాను చేశారు. సోషియో ఫాంటసీ జోనర్‌లో వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడదే పేరుతో నాగ చైతన్య నటించడంతో అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాను అద్వైత్ చందన్ తెరకెక్కించారు. ఇందులో ఆమిర్ ఖాన్‌కు జోడీగా కరీనా కపూర్ నటించింది. ఆమిర్ ఖాన్, కిరణ్ రావు, అజిత్ అందారే దీన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.

    English summary
    Akkineni Naga Chaitanya Laal Singh Chaddha Movie with Aamir Khan. Chaitanya Play Balaraju Role in this FIlm.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X