twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    NC22: ఇప్పటి హీరోలెవరూ చేయని పాత్రలో నాగ చైతన్య.. నిజంగా పెద్ద సాహసమే

    |

    టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన శైలి చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ ప్రత్యేకమైన ఇమేజ్‌తో దూసుకుపోతోన్నాడు యువ సామ్రాట్ నాగ చైతన్య. కెరీర్ ఆరంభంలోనే పలు విజయాలను ఖాతాలో వేసుకున్న అతడు.. మధ్యలో వరుస పరాజయాలతో సతమతం అయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మధ్య కాలంలో మళ్లీ విజయాల బాటలో పయనించాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాది అతడు వరుసగా 'థ్యాంక్యూ', 'లాల్ సింగ్ చడ్డా' వంటి పరాజయాలను చవి చూశాడు. వీటిని పట్టించుకోకుండా ఇప్పుడు చైతూ మరో ప్రాజెక్టును పట్టాలెక్కించాడు.

    మళ్లీ బికినీలో నిహారిక ఓవర్ డోస్ హాట్ షో: ఎద అందాలు కూడా కనిపించేలా!మళ్లీ బికినీలో నిహారిక ఓవర్ డోస్ హాట్ షో: ఎద అందాలు కూడా కనిపించేలా!

    ప్రస్తుతం నాగ చైతన్య.. కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తన 22వ సినిమాను చేస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ మూవీపై విభిన్నమైన కాన్సెప్టుతో రాబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన రెగ్యూలర్ షూట్ కూడా ప్రారంభం అయింది. అంతేకాదు, ఇప్పటికే చిత్ర యూనిట్ పలు షెడ్యూళ్లను కూడా జరుపుకుంది. అలాగే, ఏమాత్రం బ్రేక్ లేకుండా చిత్రీకరణను జరుపుకుంటూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమా గురించి, అందులో నాగ చైతన్య చేస్తున్న పాత్ర గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది.

    Naga Chaitanya Police Constable Role in NC22

    క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రాబోతుందట. ఇందులో నాగ చైతన్య ఓ సాధారణ పోలీస్ కానిస్టేబుల్ పాత్రను చేస్తున్నాడని తాజాగా తెలిసింది. ఓ మర్డర్ కేసును ఛేదించడం కోసం అతడు చేసే ప్రయత్నాలతో ఈ సినిమా సాగుతుందని అంటున్నారు. అంతేకాదు, దీనికోసం హీరో చేసే సాహసాలు గతంలో ఎన్నడూ చూడని విధంగా ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా.. అంతటి పెద్ద ఇమేజ్ ఉన్న చైతూ.. చిన్న కానిస్టేబుల్ పాత్రను చేస్తున్నాడన్న న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

    షర్ట్ విప్పేసి అరాచకంగా ప్రణిత: ఆమె ఓ బిడ్డకు తల్లంటే నమ్ముతారా!షర్ట్ విప్పేసి అరాచకంగా ప్రణిత: ఆమె ఓ బిడ్డకు తల్లంటే నమ్ముతారా!

    నాగ చైతన్య - వెంకట్ ప్రభు కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ సినిమాను పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రేమీ విశ్వనాథ్, అరవింద స్వామి, శరత్ కుమార్, సంపత్, వెన్నెల కిశోర్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

    English summary
    Akkineni Naga Chaitanya Recently Started His 22nd Movie With Venkat Prabhu. He Plays Police Constable Role in This Film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X