సోషల్ మీడియాలో నాగ చైతన్య రికార్డు: సెలెబ్రేట్ చేసుకుంటున్న అక్కినేని ఫ్యాన్స్
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది స్టార్ హీరోల వారసులు పరిచయం అయ్యారు. అయితే, అందులో కొందరు మాత్రమే భారీ స్థాయిలో సక్సెస్ అయి స్టార్లుగా వెలుగొందుతున్నారు. అందులో అక్కినేని నట వారసుడు యువసామ్రాట్ నాగ చైతన్య ఒకడు. 'జోష్' అనే సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన అతడు.. ఆ తర్వాత వచ్చిన 'ఏమాయ చేశావే'తో హిట్‌ను అందుకున్నాడు. అప్పటి నుంచి రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇలా నాగ చైతన్య ఎన్నో విజయాలను అందుకోవడంతో పాటు కొన్ని పరాజయాలను సైతం చవి చూసిన విషయం తెలిసిందే.
ఆ మధ్య చాలా కాలం పాటు వరుస ఫ్లాపులతో సతమతం అవడంతో పాటు కెరీర్‌ను ప్రశ్నార్థకం చేసుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే శివ నిర్వాణ తెరకెక్కించిన 'మజిలీ' అనే మూవీతో హిట్ ట్రాక్ ఎక్కి.. అక్కడి నుంచి దూసుకుపోతున్నాడు. దీని తర్వాత 'వెంకీ మామ', 'లవ్ స్టోరి' వంటి హిట్లతో హ్యాట్రిక్‌ను కూడా అందుకున్నాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఆరంభంలో తన తండ్రి నాగార్జునతో కలిసి నటించిన 'బంగార్రాజు' మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది కూడా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో అతడి ఖాతాలో మరో హిట్ వచ్చి చేరినట్లైంది. ఈ జోష్‌తోనే ఫ్యూచర్ ప్రాజెక్టులను సైతం చేసుకుంటూ వెళ్తున్నాడు.
నాగ చైతన్య ఇప్పటికే విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ' అనే సినిమాను దాదాపుగా పూర్తి చేసేసుకున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇది షూటింగ్ జరుగుతోన్న సమయంలోనే ఈ అక్కినేని హీరో 'లాల్ సింగ్ చద్దా' అనే హిందీ మూవీలోనూ నటించాడు. ఆమిర్ ఖాన్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో ఈ యంగ్ హీరో.. దాదాపు 20 నిమిషాల పాటు ఉండే ఓ తెలుగు కుర్రాడి పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్‌ను కూడా అతడు పూర్తి చేసుకున్నాడు. ఇలా ఈ యంగ్ హీరో సినిమాలను పూర్తి చేస్తూ.. కొత్త వాటిని లైన్‌లో పెడుతున్నాడు.

అక్కినేని నాగ చైతన్య సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటాడన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటాడు. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను కూడా వదులుతున్నాడు. దీంతో చైతూను ఫాలో అయ్యే సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ అక్కినేని హీరో ఇన్‌స్టాగ్రామ్‌లో ఏడు మిలియన్ల ఫాలోవర్ల మార్కును చేరుకున్నాడు. దీంతో ఈ ఘనతను అందుకున్న తక్కువ మంది టాలీవుడ్ హీరోల జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
ఇదిలా ఉండగా.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న అక్కినేని నాగ చైతన్య.. ఇప్పుడు అమెజాన్ సంస్థ కోసం 'ధూత' అనే వెబ్ సిరీస్‌ను కూడా చేయబోతున్నాడని తెలిసిందే. దీనిపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించబోతున్నారు. ఈ వెబ్ సిరీస్‌ను విలక్షణ చిత్రాల దర్శకుడిగా పేరొందిన విక్రమ్ కే కుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో చాలా మంది ప్రముఖులు కీలక పాత్రలను చేస్తున్నారు. ఇక, తాజాగా ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన షూటింగ్ ప్రారంభం అయింది.


Click it and Unblock the Notifications











