Don't Miss!
- News
రామ మందిరానికి రూ.3400 కోట్ల విరాళం - ఎంత మంది ఇచ్చారంటే..!!
- Finance
Medicines Prices: బీపీ, షుగర్ రోగులకు చేదు వార్త.. పెరిగిన మందుల ధరలు.. ఎక్కడంటే..
- Sports
ఆ వార్త తెలిసి మా అత్తయ్య తెగ ఉప్పొంగిపోయింది : బుమ్రా భార్య సంజనా గణేషన్
- Technology
భారత విద్యార్థులకు ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించిన Samsung!
- Automobiles
టొయోట నుంచి 'అర్బన్ క్రూయిజర్ హైరైడర్' వచ్చేసింది: బుకింగ్స్ ప్రైస్ ఎంతంటే?
- Lifestyle
Heartburn and Acid Reflux: హార్ట్ బర్న్ మరియు యాసిడ్ రిఫ్లక్స్ ఒకటే అని పొరబడకండి, ఇదే తేడా..
- Travel
సీనియర్ సిటిజన్స్‌తో ట్రావెల్ చేస్తే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
స్టేజ్ పైనే చైతు చిలిపి వేషాలు.. బంగార్రాజు తరహాలోనే హీరోయిన్ తో అలా.. వీడియో వైరల్
సంక్రాంతి కానుకగా రాబోతున్న బంగార్రాజు సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో గాని చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం ఆ సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నారు. తప్పకుండా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ డోస్ కూడా పెంచుతున్నారు.. అయితే ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగచైతన్య ఎవరూ ఊహించని విధంగా ఒక హీరోయిన్ తో చాలా చిలిపిగా కనిపించాడు. దీంతో అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంక్రాంతి సెంటిమెంట్
మనం సినిమా తర్వాత నాగార్జున నాగచైతన్య కలిసి నటిస్తున్న ఫుల్ లెన్త్ మల్టీస్టారర్ మూవీ బంగార్రాజు సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి. 2016 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సోగ్గాడే చిన్నినాయన సినిమాకు బంగార్రాజు కొనసాగింపుగా వస్తున్న విషయం తెలిసిందే.. సంక్రాంతికి సక్సెస్ అందుకోవాలని నాగార్జున పట్టుబట్టి మళ్లీ అదే వాతావరణంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

రమ్యకృష్ణ బ్యూటీఫుల్ పాత్రలో
కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగచైతన్య బంగార్రాజు మనవడిగా యువ బంగార్రాజు తరహాలో కనిపించబోతున్నాడు. నాగచైతన్యకు జోడీగా నాగలక్ష్మి అనే పాత్రలో కృతి శెట్టి నటించిన విషయం తెలిసిందే. రమ్యకృష్ణ కూడా ఎప్పటిలానే ఈ సినిమాలో చాలా అందంగా కనిపించడం విశేషం. చైతన్యకు నానమ్మ పాత్రలో నటించినప్పటికీ కూడా ఆమె మళ్లీ బ్యూటిఫుల్ గానే దర్శనమిచ్చింది.
|
చూపులతోనే రొమాన్స్
ఇక అసలు విషయంలోకి వస్తే ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగచైతన్య బంగార్రాజు తరహాలో చాలా చిలిపిగా కనిపించినట్లుగా అర్థమవుతోంది. ఒకవైపు తండ్రి నాగచైతన్య స్టేజ్ పైన మాట్లాడుతుండగా నాగచైతన్య మాత్రం మరొక హీరోయిన్ తో చూపులతోనే రొమాన్స్ చేసినట్లు అనిపించింది. అందుకు సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతోంది.

చిలిపి నవ్వులు
సినిమా హీరోయిన్స్ లో ఒకరైన దక్ష నగర్కార్ - నాగచైతన్యకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రపంచంలో ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. బంగార్రాజు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగ చైతన్య చాలా నార్మల్ గా అలా వెనక్కి తిరిగి చూడటం తో దక్ష కూడా అతని వైపు చూసింది. ఇక ఇద్దరు చూసుకుంటూ చిలిపిగా నవ్వుతూ కనిపించారు. చాలా నేచురల్ గా ఎవరూ ఊహించని విధంగా వారిద్దరూ అలా కనిపించడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. మరి సినిమాలో వీరి కలయిక ఏ విధంగా ఉంటుందో చూడాలి.

అందరికి నచ్చే విధంగా..
సినిమాలో మొత్తంగా ఆరుగురు హీరోయిన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతున్నట్లు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. తప్పకుండా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ అభిమానులకు నచ్చే విధంగానే ఉంటాయి అని వివరణ ఇచ్చారు. మరి జనవరి 14న రాబోయే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో వసూళ్లను అందుకుంటుందో చూడాలి.