సీనియర్ హీరో కొడుకు నో చెప్పిన సినిమాలో నాగ చైతన్య.. పాపం ఎన్ని కష్టాలు పడుతున్నాడో.!

అక్కినేని నాగ చైతన్య.. నాగార్జున కుమారుడిగా సినీ రంగ ప్రవేశం చేసినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ఎంతో కృషి చేస్తున్నాడు. కెరీర్ తొలినాళ్లలో కొన్ని హిట్స్ వచ్చినా.. ఆ తర్వాత చాలా వరకు ఫ్లాప్‌లు పలకరించాయి. దీంతో కొద్దిరోజులుగా సరైన హిట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఈ క్రమంలోనే తన భార్య సమంతతో కలిసి నటించిన 'మజిలీ' ద్వారా చైతూ మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. అప్పటి నుంచి ఇకపై చేసే సినిమాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఈ అక్కినేని హీరో భావిస్తున్నాడట. ఇందులో భాగంగానే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాడని తెలుస్తోంది.

 Naga Chaitanya replace Dhruv for Sekhar Kammula movie

'మజిలీ' గ్రాండ్ సక్సెస్ అవడంతో నాగ చైతన్య రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే విక్టరీ వెంకటేష్‌తో కలిసి 'వెంకీ మామ' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమాను బాబీ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో వెంకీ సరసన పాయల్, చైతూకు జంటగా రాశీ ఖన్నా నటిస్తున్నారు.

ఈ సినిమా విడుదల కాకముందే నాగ చైతన్య.. శేఖర్ కమ్ముల మూవీని ఓకే చేసేశాడు. ఇందులో చైతూ సరసన సాయి పల్లవి నటిస్తోంది. సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాను ఏషియన్ గ్రూప్ ఫిల్మ్స్ వాళ్లు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హీరోగా నాగ చైతన్యకు ఇది 20వ సినిమా.

తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సినిమా కోసం ముందు చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్‌ను సంప్రదించాడట. అప్పుడు అతడు 'అర్జున్ రెడ్డి' సినిమా రీమేక్‌లో బిజీగా ఉండడంతో దీనికి నో చెప్పాడని తెలిసింది. ఆ తర్వాత చైతూకి కథ చెప్పడం.. దానికి ఈ యంగ్ హీరో ఓకే చెప్పడం వెంట వెంటనే జరిగిపోయాయని సమాచారం.

ఈ సినిమా చైతూ.. డ్యాన్స్ మాస్టర్‌గా కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. దీని కోసం ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ల దగ్గర శిక్షణ తీసుకుంటున్నాడట. అలాగే, ఇందులో హీరో తెలంగాణ యాస మాట్లాడాల్సి ఉంటుందని టాక్. అందుకోసం ఈ యాసను స్పష్టంగా పలికేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నాడని ఫిలింనగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X