Don't Miss!
- Sports
Brett Lee Advice: కోహ్లీకి ఇంతకంటే మంచి టైం దొరకదు.. కచ్చితంగా ఈ టైం ఉపయోగించుకోవాలి
- Finance
క్రిప్టో మార్కెట్ లాభాల్లోనే ఉంది, కానీ బిట్ కాయిన్ 30,000 డాలర్లకు దిగువనే
- News
ఆధార్ కార్డ్ జిరాక్స్‌లను అందరితో పంచుకోవద్దు: ‘మాస్క్డ్ ఆధార్’పై కేంద్రం తాజా ఉత్తర్వలు
- Lifestyle
విరేచనాలు ఎక్కువ అయ్యిందా? ఈ టీలో ఏదైనా తాగితే వెంటనే ఆగిపోతాయి ...
- Automobiles
Eeco ప్రియులకు గుడ్ న్యూస్.. ఎందుకో ఇక్కడ చూడండి
- Technology
ఆపిల్ వాచ్‌లో ఎయిర్టెల్ Wynk మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌కి యాక్సెస్!!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
samantha హ్యపీ.. నేను హ్యాపీ.. విడాకుల మీద నోరు విప్పిన నాగచైతన్య
అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులు ప్రకటన వచ్చిన మూడు నెలల తర్వాత కూడా వారి విడాకుల గురించి ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఇప్పటి వరకు మీడియా ముఖంగా నేరుగా విడాకుల గురించి స్పందించని నాగచైతన్య మొట్ట మొదటిసారిగా ఈ విషయం మీద నోరు విప్పారు. ఆ వివరాల్లోకి వెళితే

మీడియాలో కధనాలు
అక్కినేని నాగచైతన్య, సమంత ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఏం మాయ చేసావే సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది చాన్నాళ్ల తర్వాత ప్రేమగా మారింది. ఈ ఇద్దరూ కూడా తమ తమ ఇళ్లల్లో ప్రేమ వివాహాన్ని అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరి వివాహం మొదలు అనేక విషయాల్లో మీడియాలో హైలెట్ అవుతూ వచ్చారు. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ అనూహ్య పరిస్థితుల్లో వీరిద్దరూ విడిపోతున్నారు అంటూ చాలా రోజుల నుంచి మీడియాలో కధనాలు రావడం మొదలయ్యాయి.

పరిస్థితి అర్థం చేసుకోవచ్చు
ముందు అందరూ ఇది నిజం కాకపోవచ్చు అని భావించారు కానీ అక్టోబర్ రెండో తేదీన వీరి వివాహ వార్షికోత్సవానికి సరిగ్గా రోజుల ముందు తాము ఇద్దరం విడిపోతున్నట్లు గా అధికారికంగా ఈ జంట ప్రకటించింది. అయితే విడిపోయిన తర్వాత ఈ విడాకులకు కారణం సమంత వేరే వ్యక్తితో అక్రమ సంబంధం అని కొన్ని మీడియా సంస్థలు కథనాలు కూడా వండి వార్చాయి. అయితే ఆ విషయం మీద నాగచైతన్య ఎలాంటి స్పందన ఇవ్వ లేదు కానీ సమంత మాత్రం నేను అలాంటి దాన్ని కాదు అని చెప్పుకునే ప్రయత్నం చాలా వరకు చేసింది. ఇక పరిధి దాటి వ్యవహరిస్తున్న మీడియాను కట్టడి చేసేందుకు గాను ఆమె కోర్టుకు కూడా వెళ్ళింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

బిజీబిజీగా
అయితే
నాగచైతన్య
మాత్రం
ఇప్పటిదాకా
ఈ
విషయం
మీద
నేరుగా
స్పందించిన
దాఖలాలు
లేవు.
కానీ
తాజాగా
ఆయన
మీడియా
ముందు
నోరు
విప్పాల్సిన
పరిస్థితులు
ఏర్పడ్డాయి.
విషయం
ఏమిటంటే
అక్కినేని
నాగచైతన్య
హీరోగా
నటించిన
బంగార్రాజు
సినిమా
సంక్రాంతి
కానుకగా
విడుదలకు
రంగం
సిద్ధమైంది.
జనవరి
14
వ
తేదీన
విడుదల
కాబోతున్న
ఈ
సినిమాకు
సంబంధించిన
ప్రమోషన్
లో
సినిమా
యూనిట్
బిజీబిజీగా
గడుపుతోంది.

నేను కూడా సంతోషంగా ఉన్నాను
ఈ
సినిమా
ప్రమోషన్
లో
భాగంగా
నాగచైతన్య
అనేక
ఛానళ్లకు
మీడియా
సంస్థలకు
ఇంటర్వ్యూ
ఇస్తున్నారు.
అందులో
భాగంగానే
విడాకుల
విషయం
మీద
ఒక
ప్రశ్న
ఎదురుకాగా
దానికి
తప్పించుకోకుండా
ఆయన
సమాధానం
ఇచ్చారు.
ఇది
ఇద్దరి
మంచి
కోసం
తీసుకున్న
నిర్ణయం
అని
పేర్కొన్న
ఆయన
ఈ
నిర్ణయం
తీసుకున్న
తర్వాత
ఆమె(సమంత)
సంతోషంగా
ఉంది,
నేను
కూడా
సంతోషంగా
ఉన్నాను
ఈ
పరిస్థితుల్లో
ఇద్దరికీ
బెస్ట్
డెసిషన్
ఇదే
అని
ఆయన
చెప్పుకొచ్చారు.

హాట్ టాపిక్ గా
ఎవరో ఫోన్ లో షూట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతానికి సమంత కూడా చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. ఆమె చివరి గా కనిపించిన పుష్ప సినిమా అద్భుతంగా హిట్ కావడమే కాక కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఆ సినిమాలో ఆమె ఐటమ్ సాంగ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.