Laal Singh Chaddha మూవీలో అమీర్ ఖాన్‌తో ఎందుకు నటించానంటే.. కారణం అదే అంటూ నాగచైతన్య ఎమోషనల్
థ్యాంక్యూ తర్వాత నాగచైతన్య నటించిన లాల్ సింగ్ చద్దా చిత్రం ఆగస్టు 11వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ చిత్రంలో మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్‌తో కలిసి నటించడం విశేషం. అయితే ఈ సినిమాను ఇటీవల చిరంజీవి ఇంట్లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఎస్ఎస్ రాజమౌళి, సుకుమార్, చిరంజీవితో కలిసి నాగచైతన్య చూశారు. ఈ సినిమా షూటింగు అనుభవాలను థ్యాంక్యూ ప్రమోషన్‌లో పంచుకుంటూ...
లాల్ సింగ్ చద్దాలోని పాత్ర కోసం నేను ఫిట్‌గా ఉండాలి. అందుచేత నేను బాగా సన్నబడాల్సి వచ్చింది. ఆ సినిమాలో 25 ఏళ్ల యువకుడిగా కనిపించాలి. ఇటీవల చిరంజీవి గారి ఇంట్లో స్పెషల్ ప్రివ్యూను అమీర్ ఖాన్ ప్రదర్శించారు. చిరంజీవి గారికి బాగా నచ్చింది. ఈ సినిమాను ఆయన ప్రజెంట్ చేస్తున్నారు. చిరంజీవి గారితో, రాజమౌళి గారితో, సుకుమార్ గారితో కలిసి సినిమా చూడటం నాకు జీవితాంత గుర్తుండిపోయే మధురస్మృతి అని నాగచైతన్య అన్నారు.

లాల్ సింగ్ చద్దాలో నటించడానికి ప్రధాన కారణం అమీర్ ఖాన్‌తో నటించాలనే కోరిక. ఆయన పక్కన నటిస్తే ఎలా ఉంటుంది. ఆయన సినిమా ఎలా తీస్తారు అనే విషయాలను నేర్చుకోవాలని అనుకొన్నాను. అందుకే అమీర్ ఖాన్ సినిమాలో నటించాను. లాల్ సింగ్ చద్దాలో నేను అమీర్ ఖాన్‌కు ఫ్రెండ్‌గా నటించాను అని నాగచైతన్య చెప్పారు.
ఎక్కువ మంది హీరోయిన్లతో నటించే విషయంలో మా నాన్నను ఫాలో అవుతుంటారా అంటే అలాంటిదేమీ లేదు. నా సినిమాల్లో ఒకే హీరోయిన్ మాత్రమే ఉంటుంది. ఈ సినిమాలో రాశీ ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ లాంటి హీరోయిన్లు కథను బట్టే సినిమాలోకి వచ్చారు. బంగార్రాజు సినిమాల్లో నా పాత్ర చాలా ఎనర్జీతో కూడినది. అలాంటి పాత్రలో నాన్న పక్కన నటించడం చాలా భయంగా ఉండేది.


Click it and Unblock the Notifications











