శోభితతో అలాంటి గొడవ.. ఆ హీరోయిన్‌ కారణంగా.. నాగచైతన్య

అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya)కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన మూవీ 'తండేల్'(Tandel). వరుస ఫ్లాప్స్‌ తర్వాత వచ్చిన ఈ సినిమా అతనికి మాత్రమే కాదు, మొత్తం అక్కినేని ఫ్యామిలీకి కూడా ఓ ఊరట నిచ్చింది. రూ.100 కోట్ల మార్క్ దాటిన ఈ సినిమా, బ్లాక్‌బస్టర్‌ మూవీగా మారి చైతన్య కెరీర్‌ను మళ్లీ పటిష్టపరిచింది. అయితే ఈ విజయం వెనుక ఓ చిన్న ఫన్నీ ఇన్సిడెంట్‌ దాగి ఉందని, దానివల్ల తన భార్య శోభిత ధూలిపాళ్ల (Sobhita Dhulipala) కొన్నాళ్ల పాటు తనతో మాట్లాడలేదని నాగ చైతన్య స్వయంగా వెల్లడించాడు. ఇంతకీ ఏం జరిగింది? అంత పెద్ద సక్సెస్ అందుకున్న తరువాత గొడవ జరగడమేంటీ? వివరాల్లోకెళ్తే..

ఇటీవల జీ తెలుగు లో జగపతి బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో 'జయమ్ము నిశ్చయమ్మురా' లో గెస్ట్‌గా పాల్గొన్న హీరో నాగ చైతన్య ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ షోలో చైతూ తన జీవితంలో జరిగిన ఆసక్తికర సంఘటన, ఫన్నీ మూమెంట్స్ ను షేర్ చేసుకున్నాడు. ఈ క్రమంలో తనకు, తన భార్య శోభితకు మధ్య చిన్న గొడవ జరిగిందనీ, ఆ గొడవ కారణంగా.. తామిద్దరం మాట్లాడుకోలేదని షాకింగ్ విషయాలు వెల్లడించారు.

Naga Chaitanya Reveals Funny Fight with Sobhita After Tandel Bujjithalli Song Became a Hit

చైతన్య మాట్లాడుతూ "తండేల్ సినిమాలోని 'బుజ్జితల్లి'పాట చాలా పెద్ద హిట్ అయింది. కానీ, ఆ పాట కారణంగా శోభిత కొన్ని రోజులు మాట్లాడటం మానేసింది. ఎందుకంటే.. నేను ఇంట్లో శోభితను మొదటి నుంచీ ప్రేమగా 'బుజ్జి' లేదా 'బుజ్జితల్లి'అని పిలుస్తుంటాను. కానీ అదే పేరుతో సినిమాలో సాయి పల్లవిని పిలవడంతో ఆమెకి కోపం వచ్చింది. 'నువ్వే కాదా డైరెక్టర్ కు చెప్పి ఆ పేరును పెట్టించావు కదా!'అంటూ కొన్నాళ్లు శోభిత నాతో మాట్లాడడం మానేసింది"అని నవ్వుతూ చెప్పాడు.

"ఏదిఏమైనా బుచ్చి తల్లి పాట గొడవ వల్ల మా రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ గా మారింది. ఈ ప్రపంచంలో గొడవ పడని జంటలు ఉండరు. ఇద్దరి మధ్య గొడవలే లేవంటే, వాళ్ల రిలేషన్‌షిప్‌ నిజమైనది కాదన్న మాట" అంటూ భార్యభర్తల రిలేషన్‌ పై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు నాగ చైతన్య. ఆ తరువాత జగపతి బాబు "మీ పరిచయం ఎలా మొదలైంది?"అన్న ప్రశ్నించగా.. చైతూ ఆసక్తికరంగా "మా పరిచయం పూర్తిగా సోషల్ మీడియా ద్వారానే. హైదరాబాద్‌లో నా రెస్టారెంట్ 'షోయూ'కి సంబంధించిన ఫుడ్ ఫోటోలు మా టీమ్ పోస్ట్ చేస్తుంటే, శోభిత వాటికి లైక్‌లు, కామెంట్స్, ఎమోజీలు పెట్టేది. అలా మొదలైన పరిచయం క్రమంగా స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది" అని చెప్పారు.

చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన తండేల్ మూవీలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ చైతన్య కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ముఖ్యంగా 'బుజ్జితల్లి' పాట సినిమాకు ఆ సినిమాకు ఎక్స్ ట్రా బజ్ తీసుకొచ్చింది. కానీ అదే పాట కారణంగా తనకు తన భార్య శోభితకు గొడవ జరిగిందనీ చైతూ సరదాగా చెప్పడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో 'శోభిత చాలా గట్టి అమ్మాయిలా ఉంది','అక్కినేని కోడలా మాజాకా!", 'శోభితా, నాగ చైతన్య మధ్య గొడవకు సాయి పల్లవి కారణమైందా? అంటూ నెటిజెన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక నాగ చైతన్య కెరీర్ విషయానికి వస్తే.. చైతూ 24వ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మైథలాజికల్ కథ మూవీ, చైతన్య ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పూర్తి చేసుకుని, షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్, సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X