Naga Chaitanya: ఆమె అంటే క్రష్​.. ఆ ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోను.. చైతన్య కామెంట్స్​ వైరల్​

అక్కినేని నట వారసుడు నాగ చైతన్య టాలీవుడ్​ గుడ్​ బాయ్​గా పేరు తెచ్చుకున్నాడు. సాధ్యమైనంత వరకు కాంట్రవర్సీలకు దూరంగా ఉంటాడు. సినిమాలు, ప్రమోషన్లు అంటూ తన పని తాను చూసుకుంటుపోయే కామ్​ పర్సన్. అయితే స్టార్​ హీరోయిన్​ సమంతతో నాగ చైతన్యకు విడాకులు అయినప్పటి నుంచి వారి వ్యక్తిగత విషయాలపై అందరూ ఆసక్తి చూపుతున్నారు.

తన పర్సనల్​ లైఫ్‌​కు సంబంధించిన ప్రశ్నలు నాగ చైతన్యకు ఎక్కువ అయ్యాయి. అలాగే ఇంతకుముందు తన వ్యక్తిగత విషయాలను అంతగా షేర్​ చేసుకోని నాగ చైతన్య ఇటీవల కాలంలో చాలా ఫ్రీగా ఓపేన్​ అవుతున్నాడు. ఈ క్రమంలోనే తన క్రష్​, భవిష్యత్తులో ఏ హీరోయిన్​తో నటించాలనుకుంటున్నాడనే తదితర ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

నాగార్జున తనయుడిగా సినీ ఇండస్ట్రీకి

నాగార్జున తనయుడిగా సినీ ఇండస్ట్రీకి

టాలీవుడ్​ మన్మథుడు నాగార్జున తనయుడిగా సినీ ఇండస్ట్రీకి నాగ చైతన్య ఎంట్రీ ఇచ్చి 13 ఏళ్లు కావొస్తుంది. 2009లో విడుదలైన జోష్​ సినిమాతో హీరోగా పరిచయమైన చైతూ సినీ కెరీర్​లో ఎన్నో హిట్లు, ఫట్లు ఉన్నాయి. ఇటీవల థ్యాంక్యూ సినిమాతో ప్రేక్షకులను, అభిమానులను నిరాశపరిచిన నాగ చైతన్య బాలీవుడ్‌​లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

చడ్డీ బడ్డీ బాలరాజు పాత్రలో

చడ్డీ బడ్డీ బాలరాజు పాత్రలో

బాలీవుడ్​ మిస్టర్​ పర్​ఫెక్ట్​ అమీర్​ ఖాన్​ ప్రధాన పాత్రలో నటించిన లాల్​ సింగ్​ చడ్డా సినిమా ఆగస్టు 11న విడుదలైంది. రిలీజైన తొలి రోజు నుంచే ఈ సినిమా నెగెటివ్​ టాక్​ను మూటగట్టుంది. ఇందులో చడ్డా.. చడ్డీ బడ్డీ బాలరాజు పాత్రలో నటించాడు చైతూ. అయితే సినిమా ఎలా ఉన్నా నాగ చైతన్య తన నటనకు ప్రశంసలు అందుకుంటున్నాడు.

ఇక నాగ చైతన్య బాలీవుడ్​ డెబ్యూ ఇచ్చిన లాల్​ సింగ్​ చడ్డా చిత్రం హాలీవుడ్​ క్లాసిక్ హిట్​ మూవీ ది ఫారెస్ట్​ గంప్‌​కు రీమేక్‌గా వచ్చిన విషయం తెలిసిందే. ఈ రీమేక్​ సినిమాకు అద్వైత్ చందన్​ దర్శకత్వం వహించారు. లాల్​ సింగ్​ చడ్డా విడుదలైన వారంల రోజుల్లో ఇండియన్​ బాక్సాఫీస్​ వద్ద రూ. 37.96 కోట్లు వసూలు చేసిందని సమాచారం.

కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా

కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా

లాల్ సింగ్ చడ్డా సినిమా కోసం బాలీవుడ్‌కు ఎక్కువ సమయం కేటాయిస్తున్న నాగ చైతన్య తరచూ అక్కడి మీడియాతో ఇంటరాక్ట్​ అవుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ నేషనల్​ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన చైతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. భవిష్యత్తులో బాలీవుడ్​లో కథానాయకుడిగా చేయాల్సి వస్తే ఏ హీరోయిన్స్​తో కలిసి నటించాలని అనుకుంటున్నారన్న ప్రశ్నకు అలియా భట్​, కత్రీనా కైఫ్, ప్రియాంక చోప్రా అంటూ సమాధానమిచ్చాడు చైతూ.

ఆలియాభట్‌తో

ఆలియాభట్‌తో


బాలీవుడ్ హీరోయిన్లలో ముఖ్యంగా అలియా భట్​ నటన అంటే తనకు ఎంతో ఇష్టమని, ఐ లవ్​ హర్ యాక్టింగ్​ అంటూ పొగిడాడు. అలియా భట్‌​తో నటించే అవకాశం వస్తే అస్సలు వదులుకోనని మనసులో మాట బయటపెట్టాడు చైతూ. ఇక మనం సినిమా హిందీలో రీమేక్​ చేస్తే తన పాత్రలో రణ్​బీర్​ కపూర్​ నటిస్తే బాగుంటుందని సమాధానం ఇచ్చాడు ఈ అక్కినేని యువ హీరో.

సుస్మితా సేన్ గురించి కామెంట్స్

సుస్మితా సేన్ గురించి కామెంట్స్


ఇంటర్వ్యూలో భాగంగా సెలబ్రిటీ క్రష్​ ఎవరని అడిగిన ప్రశ్నకు మాజీ విశ్వ సుందరి, బ్యూటీఫుల్​ సీనియర్​ హీరోయిన్​ సుష్మితా సేన్​ అని బయటపెట్టాడు చైతూ. ప్రస్తుతం ఈ కామెంట్స్​ సోషల్​ మీడియాలో తెగ వైరల్​ అవుతున్నాయి. కాగా 1997లో విడుదలైన రక్షకుడు సినిమాలో నాగార్జునతో కలిసి సుష్మితా సేన్ జోడి కట్టిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X