Naga Chaitanya తో కెమిస్ట్రీ ఫుల్లుగా వర్కువుట్.. అందుకే మరిన్నీ సీన్లు కలిపేస్తున్న దర్శకుడు

టాలీవుడ్‌లో వరుస విజయాలతో దుమ్మురేపుతున్న నాగచైతన్య అక్కినేని మరోసారి సంక్రాంతి హిట్టును తన ఖాతాలో వేసుకొనేందుకు సిద్దమవుతున్నాడు. చైతూ తన తండ్రితో కలిసి తొలిసారి తెరమీద మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా మారుతున్న చైతూకు, తన అభిమానులకు సంతోషం కలిగించే వార్త ఒకటి వైరల్ అయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త ఏమిటంటే?..

Recommended Video

Bangarraju Musical Night Part 1 : RJ Kajal And Lahari Shari Fun | Filmibeat Telugu
బాలు అనే పాత్రలో చైతూ

బాలు అనే పాత్రలో చైతూ

టాలీవుడ్‌లోనే తన మార్కుతో ఆకట్టుకొంటున్న నాగచైతన్య బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నాడు. అమీర్ ఖాన్ రూపొందిస్తున్న లాల్ సింగ్ చద్దా చిత్రంలో బాలు అనే కీలక పాత్రను చైతూ పోషిస్తున్నారు. తొలుత ఈ పాత్రను తమిళ నటుడు విజయ్ సేతుపతి చేయాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ పాత్రను చైతూ దక్కించుకొన్నాడు.

నాగచైతన్య నటనపై అమీర్ ఖాన్

నాగచైతన్య నటనపై అమీర్ ఖాన్

లాల్ సింగ్ చద్దా సినిమా కోసం లడఖ్‌లోని మారుమూల ప్రాంతంలో కీలక సన్నివేశాలను యూనిట్ చిత్రీకరించింది. ఈ సినిమాలో అమీర్ ఖాన్‌తో కలిసి ప్రధానమైన సన్నివేశాల్లో చైతూ నటించాడు. సినిమా షూటింగ్ ముగిసిన తర్వాత చైతూ నటన గురించి లవ్ స్టోరి ఫంక్షన్‌లో ప్రశంసల వర్షం కురిపించారు. లవ్ స్టోరి ఈవెంట్‌కు అమీర్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే.

అమీర్ ఖాన్, చైతూ హై వోల్టేజ్ సీన్లలో

అమీర్ ఖాన్, చైతూ హై వోల్టేజ్ సీన్లలో

అయితే హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గంప్ ఆధారంగా రూపొందుతున్న లాల్ సింగ్ చద్దా సినిమాలో అమీర్ ఖాన్‌తో నాగచైతన్య నటించిన హై వోల్టేజ్ సన్నివేశాలు దర్శకుడిని కొత్త అనుభూతికి గురిచేశాయట. ఫస్ట్ కాపీ తర్వాత సినిమా చూసిన దర్శకుడు అద్వైత్ చందన్ థ్రిల్ అయ్యాడు. ముఖ్యంగా నాగచైతన్య ఫెర్పార్మెన్స్ చూసిన తర్వాత కీలక నిర్ణయం తీసుకొన్నాడు అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

నాగచైతన్య పాత్ర నిడివి పెంచే యోచనలో

నాగచైతన్య పాత్ర నిడివి పెంచే యోచనలో

అయితే అమీర్ ఖాన్, నాగచైతన్య మధ్య యాక్టింగ్‌కు కెమిస్ట్రీ సిల్వర్ స్క్రిన్‌పై అద్భుతంగా పండింది. అందుచేత నాగచైతన్యకు సంబంధించిన మరికొన్ని సన్నివేశాలను లాల్ సింగ్ చద్దా సినిమాలో చేర్చాలని డిసైడ్ అయ్యారు. దాంతో ఈ సినిమాలో నాగచైతన్య పాత్ర నిడివి పెరిగిపోతుంది. బాలీవుడ్‌ సినీ విమర్శకులను చైతూ ఆకట్టుకోవడం ఖాయమని చెబుతున్నారు.

నటీనటులు, సాంకేతిక నిపుణులు

నటీనటులు, సాంకేతిక నిపుణులు

నటీనటులు: అమీర్ ఖాన్, కరీనా కపూర్, నాగచైతన్య, మోనా సింగ్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, మాధురి దీక్షిత్, కాజోల్, కరిష్మా కపూర్ తదితరులు
దర్శకత్వం: అద్వైత్ చేతన్
స్క్రిన్ ప్లే: ఎరిక్ రోత్, అతుల్ కులకర్ణి
నిర్మాతలు: అమీర్ ఖాన్, కిరణ్ రావు,అజిత్ అందారే, రాధికా చౌదరీ
సినిమాటోగ్రఫి: సేతు (సత్యజిత్ పాండే)
ఎడిటింగ్: మానిక దావర్
మ్యూజిక్: ప్రీతమ్
బ్యానర్: అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్
రిలీజ్ డేట్: 2022-04-14

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X