నాగ చైతన్య సరసన నిత్యామీనన్.. డైరెక్టర్ ఎవరంటే!
అక్కినేని హీరో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం మజిలీ. వివాహం జరిగిన తరువాత తొలిసారి నాగ చైతన్య, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ఇది. శివ నిర్వాణ దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. నాగ చైతన్య ఇటీవల నటించిన సవ్యసాచి, శైలజారెడ్డి అల్లుడు లాంటి చిత్రాలు అభిమానులకు నిరాశ కలిగించాయి. దీనితో చైతు తదుపరి నటించే చిత్రాల విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నాడు. అభిమానులు తన నుంచి ఎలాంటి కథలు ఆశిస్తున్నారో అలాంటి వాటినే ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నాడు.
నాగ చైతన్య తదుపరి చిత్రానికి కూడా గ్రీన్ సింగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో దర్శకుడుగా మేర్లపాక గాంధీ గుర్తింపు తెచ్చుకున్నాడు. మేర్లపాక గాంధీ వినిపించిన కథ నచ్చడంతో నాగ చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడిగా నిత్యా మీనన్‌ని ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో ఈ చిత్రం రూపొందబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రారండోయ్ వేడుక చూద్దాం తర్వాత అంతటి విజయం కోసం చైతు ఎదురుచూస్తున్నాడు. చైతు, నిత్యామీనన్ జోడి మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి. మేర్లపాక గాంధీకి కూడా ఓ హిట్టు అవసరం. మేర్లపాక గాంధీ తెరకెక్కించిన చివరి చిత్రం కృష్ణార్జున యుద్ధం నిరాశ పరిచింది.


Click it and Unblock the Notifications











