twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్విట్టర్ రివ్యూ : శైలజారెడ్డి అల్లుడుకి రెస్పాన్స్ ఎలా ఉందంటే.. చైతు హిట్ కొట్టినట్లేనా!

    |

    అక్కినేని చైతన్య నటించిన శైలజారెడ్డి అల్లుడు చిత్రం వినాయక చవితి సందర్భంగా నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి తెరకెక్కించిన ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. నాగ చైతన్య సరసన ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ ఈ చిత్రంలో నాగ చైతన్యకు అత్త. ట్రైలర్, పాటలు ఆసక్తి రేకెత్తించే విధంగా ఉండడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇప్పటికే ప్రీమియర్ షోలు ప్రారంభమైన నేపథ్యంలో ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందొ చూద్దాం..

    డీసెంట్‌గా ఫస్ట్ హాఫ్

    శైలజారెడ్డి అల్లుడు చిత్రానికి అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉంది. సెకండ్ హాఫ్ లో కామెడీ బావుంది.

    మారుతి మార్క్

    ఈ చిత్రంలో దర్శకుడు మారుతీ మార్క్ మిస్ అయింది.

    ఫ్యామిలీ ఆడియన్స్‌కు

    శైలజారెడ్డి అల్లుడు చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ కు ప్యాకేజ్ లాంటి సినిమా. ఫస్ట్ హాఫ్ బావుంది. చిత్రంలో మంచి ఫన్ ఉంది.

    కామెడీ సన్నివేశాలు

    ఈ చిత్రంలో కామెడీ సన్నివేశాలు బావున్నాయి. శైలజారెడ్డి అల్లుడు.. రారండోయ్ వేడుక చూద్దాం కంటే బావుంది.

    ఆ ఫైట్ అదుర్స్

    నాగార్జున హలో బ్రదర్ చిత్రంలోని ప్రియరాగాలే సాంగ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో నాగ చైతన్య చేసే ఫైట్ సీన్ అద్భుతంగా ఉంది. అక్కినేని ఫాన్స్ కు ఆ ఫైట్ పండగ.

    పీక్స్‌లో చైతు పెర్ఫామెన్స్

    ఈ చిత్రంలో నాగ చైతన్య పెర్ఫామెన్స్ అద్భుతంగా ఉంది. శైలజారెడ్డి అల్లుడు చిత్రంలో ఎంటర్ టైం మెంట్ బావుంది.

    ఇంటర్వెల్ బ్యాంగ్

    ఈ చిత్రంలో ఇంటర్వెల్ బ్యాంగ్ ని ఆసక్తికరంగా తెరకెక్కించారు. గోపి సుందర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బావుంది.

    30 ఇయర్స్ ఇండస్ట్రీ

    ఈ చిత్రంలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ కామెడీ బావుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో అతడి కామెడీ నవ్వులు పూయించే విధంగా ఉంది.

    యూఎస్ ప్రీమియర్స్

    యూఎస్ ప్రీమియర్స్ నుంచి శైలజారెడ్డి అల్లుడు చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి.

    రమ్యకృష్ణ మాస్

    ఈ చిత్రంలో రమ్యకృష్ణ మాస్ పెర్ఫామెన్స్ అదుర్స్ అనిపించే విధంగా ఉంది.

    English summary
    Naga Chaitanya's Sailaja reddy alludu premier show talk. Grand Releasing today world wide
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X