Thank You : నాగచైతన్య సినిమాకి రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

అక్కినేని నాగచైతన్య రాశీఖన్నా మాళవిక నాయర్‌లు హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా థాంక్యూ. మనం, గ్యాంగ్ లీడర్ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన విక్రమ్ కే కుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నాగచైతన్య మహేష్ వీరాభిమానిగా నటిస్తున్నారు. గత ఏడాది సరిగ్గా ఏప్రిల్ నెలలో ఈ మూవీ షూటింగ్ ఇటలీలో పూర్తైంది. చైతూ టైటిల్ మోషన్ పోస్టర్ తప్ప ఇప్పటివరకు మూవీ నుంచి ఎటువంటి అప్డేట్ లేదు. చిత్రీకరణ ఎప్పుడో పూర్తయినప్పటికీ సినిమా యూనిట్ ఇప్పటి దాక విడుదల తేదీ ప్రకటించకపోవడంతో అక్కినేని అభిమానులు ఈ సినిమా విషయంలో తీవ్ర అసహనంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో థాంక్యూ సినిమా విడుదల తేదీ లాక్ అయింది.

ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్ రాజు మరియు శిరీష్ నిర్మించారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 8, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో విడుదల కానుంది. కొంతకాలంగా టాప్ ఫామ్‌లో ఉన్న తమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. లెజెండరీ లెన్స్‌మెన్ పి.సి. శ్రీరామ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించగా టాలెంటెడ్ ఎడిటర్ నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరించారు. అయితే ఈ సినిమాకు బి వి ఎస్ రవి కథ అందించారు. క్లాసిక్ మూవీ 'మనం' తర్వాత నాగ చైతన్య, విక్రమ్ కె కుమార్ తొలిసారి కలిసి పని చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్, పాటలు త్వరలో విడుదల కానున్నాయని అంటున్నారు. ఇక టాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకుంటున్న అక్కినేని నాగచైతన్య.. తొలి ఓటీటీ ఎంట్రీ కూడా సిద్దం చేసిన సంగతి తెలిసిందే.

Naga Chaitanyas Thank You Movie to be released on July 8th, 2022.

అమెజాన్ ప్రైమ్ రూపొందించే 'దూత' అనే వెబ్ సిరీస్‌తో చైతూ డిజిటల్ ప్లాట్ ఫామ్‌లోకి ఎంటర్ అవుతున్నారు. దానికి కూడా థాంక్యూ సినిమాకు దర్శకత్వం వహించిన విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక అమెజాన్‌ప్రైమ్ కొద్ది రోజుల క్రితం తమ ఫ్లాట్ ఫామ్ లో రూపొందిస్తున్న పలు వెబ్ సిరీస్ టైటిల్స్‌ను ప్రకటించారు. కరణ్ జోహార్ హోస్ట్ చేసిన ఈ కార్యక్రమంలో నాగచైతన్య 'దూత' సిరీస్‌ను కూడా గ్రాండ్ గా అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా నాగచైతన్య ఇంటెన్స్ లుక్‌ను కూడా వదిలారు. ఎవరితోనే ఫోన్ మాడ్లాడుతూ.. చైతూ సీరియస్‌గా చూస్తున్న లుక్ ఆకట్టుకుంది. ఇక ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యాక నాగచైతన్య పరశురాం డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ విషయం మీద ఇటీవలే క్లారిటీ వచ్చింది. కానీ నిర్మాతలు ఇతర వివరాలు మాత్రం వెల్లడి అవ్వాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X