Don't Miss!
- Sports
IND vs SA: రెండో ఇన్నింగ్స్‌లోనూ విరాట్ కోహ్లీ విఫలం.. భారీ ఆధిక్యం దిశగా భారత్!
- News
ఇద్దరు ఉగ్రవాదులను పట్టుకున్ని గ్రామస్తులు: ఒకరు మాజీ బీజేపీ మైనార్టీ నేత, రూ. 5 లక్షల రివార్డ్
- Finance
Axis Mutual Fund: యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ పై దావా వేసిన మాజీ ఫండ్ మేనేజర్.. ఎందుకంటే..?
- Technology
BSNL కొత్తగా మూడు ప్రీపెయిడ్ ప్లాన్లను జోడించింది!! ఆఫర్స్ మీద ఓ లుక్ వేయండి...
- Automobiles
2022 జూన్ అమ్మకాల్లో స్వల్ప వృద్ధి: హీరో మోటోకార్ప్
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జూలై 03 నుండి జూలై 9వ తేదీ వరకు..
- Travel
మన్యంలో మరుపురాని దృశ్యాలు రెండవ భాగం -2
Thank You : నాగచైతన్య సినిమాకి రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
అక్కినేని నాగచైతన్య రాశీఖన్నా మాళవిక నాయర్‌లు హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా థాంక్యూ. మనం, గ్యాంగ్ లీడర్ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన విక్రమ్ కే కుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నాగచైతన్య మహేష్ వీరాభిమానిగా నటిస్తున్నారు. గత ఏడాది సరిగ్గా ఏప్రిల్ నెలలో ఈ మూవీ షూటింగ్ ఇటలీలో పూర్తైంది. చైతూ టైటిల్ మోషన్ పోస్టర్ తప్ప ఇప్పటివరకు మూవీ నుంచి ఎటువంటి అప్డేట్ లేదు. చిత్రీకరణ ఎప్పుడో పూర్తయినప్పటికీ సినిమా యూనిట్ ఇప్పటి దాక విడుదల తేదీ ప్రకటించకపోవడంతో అక్కినేని అభిమానులు ఈ సినిమా విషయంలో తీవ్ర అసహనంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో థాంక్యూ సినిమా విడుదల తేదీ లాక్ అయింది.
ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్ రాజు మరియు శిరీష్ నిర్మించారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 8, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో విడుదల కానుంది. కొంతకాలంగా టాప్ ఫామ్‌లో ఉన్న తమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. లెజెండరీ లెన్స్‌మెన్ పి.సి. శ్రీరామ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించగా టాలెంటెడ్ ఎడిటర్ నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరించారు. అయితే ఈ సినిమాకు బి వి ఎస్ రవి కథ అందించారు. క్లాసిక్ మూవీ 'మనం' తర్వాత నాగ చైతన్య, విక్రమ్ కె కుమార్ తొలిసారి కలిసి పని చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్, పాటలు త్వరలో విడుదల కానున్నాయని అంటున్నారు. ఇక టాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకుంటున్న అక్కినేని నాగచైతన్య.. తొలి ఓటీటీ ఎంట్రీ కూడా సిద్దం చేసిన సంగతి తెలిసిందే.

అమెజాన్ ప్రైమ్ రూపొందించే 'దూత' అనే వెబ్ సిరీస్‌తో చైతూ డిజిటల్ ప్లాట్ ఫామ్‌లోకి ఎంటర్ అవుతున్నారు. దానికి కూడా థాంక్యూ సినిమాకు దర్శకత్వం వహించిన విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక అమెజాన్‌ప్రైమ్ కొద్ది రోజుల క్రితం తమ ఫ్లాట్ ఫామ్ లో రూపొందిస్తున్న పలు వెబ్ సిరీస్ టైటిల్స్‌ను ప్రకటించారు. కరణ్ జోహార్ హోస్ట్ చేసిన ఈ కార్యక్రమంలో నాగచైతన్య 'దూత' సిరీస్‌ను కూడా గ్రాండ్ గా అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా నాగచైతన్య ఇంటెన్స్ లుక్‌ను కూడా వదిలారు. ఎవరితోనే ఫోన్ మాడ్లాడుతూ.. చైతూ సీరియస్‌గా చూస్తున్న లుక్ ఆకట్టుకుంది. ఇక ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యాక నాగచైతన్య పరశురాం డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ విషయం మీద ఇటీవలే క్లారిటీ వచ్చింది. కానీ నిర్మాతలు ఇతర వివరాలు మాత్రం వెల్లడి అవ్వాల్సి ఉంది.