శోభితతో రిలేషన్ పై ఓపెన్ అయిన నాగచైతన్య.. ఆ ప్రశ్నకు సిగ్గు పడుతూ ఏమన్నారంటే?
నాగచైతన్య అక్కినేని, సమంత విడాకుల వ్యవహారం ఎంత హాట్ టాపిక్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది వారి వ్యక్తిగత వ్యవహారమే అయినా ఎందుకో ప్రేక్షకులు సాధారణ ప్రజలు ఈ విషయం మీద ఎక్కువగా ఆసక్తి కనపరిచారు. వీరిద్దరి విడాకులకు కారణం ఇదే అంటూ రకరకాల ప్రచారాలు తెర మీదకు వచ్చాయి. ఆ సంగతి పక్కన పెడితే ఈ మధ్యనే నాగ చైతన్య శోభిత ధూళిపాళ్లతో ప్రేమలో ఉన్నాడు అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు ఈ విషయంపై నాగచైతన్య స్పందించాడు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

దాఖలాలు లేవు
నాగచైతన్య, సమంత ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వారి మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ వారిద్దరు ఎట్టకేలకు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు కూడా. వారు ప్రకటించిన తర్వాత కూడా వారి విడాకుల గురించి అనేక చర్చలు జరిగాయి. అనేక ప్రచారాలు తెర మీదకు వచ్చాయి. అయితే ఎందుకు విడిపోయారు అనే విషయం మీద ఇద్దరు ఇప్పటికీ స్పందించిన దాఖలాలు లేవు.

పెళ్లి కూడా
సమంత మరెవరితోనూ కలిసి ఉందని అందుకే నాగచైతన్య విడాకులు ఇచ్చాడని అప్పట్లో ప్రచారం జరిగింది. సదరు వ్యక్తి తాను సమంతను అక్క అని పిలుస్తానని మా ఇద్దరి మధ్య అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఇప్పుడు నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల ప్రేమలో పడ్డారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ విషయం మీద ఎట్టకేలకు నాగచైతన్య పెదవి విప్పాడు.

ప్రమోషన్స్ లో
ఆయన కీలకపాత్రలో నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా బాలీవుడ్లో రూపొందిన సంగతి తెలిసిందే. అమీర్ ఖాన్, కరీనా కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మరి కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న నాగచైతన్యను దీనికి సంబంధించిన ప్రశ్నలు అడిగారు.

పెద్ద ఎత్తున ప్రచారం
ఆర్జే సిద్ధార్థ కన్నన్ శోభిత ధూళిపాల గురించి మీ రిలేషన్ గురించి చెప్పమని అడిగితే కాస్త సిగ్గు పడిన నాగచైతన్య నేను ఇప్పుడు నవ్వడం కంటే ఏమీ చేయలేను అంటూ నవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నిజంగానే చైతన్యకు శోభిత దూళిపాళ్లకు మధ్య ఏమీ లేకపోతే అదేమీ లేదని నాగచైతన్య ఖండించేవాడు కదా అలా చేయడం లేదు. అంటే నిజంగానే వారిద్దరి మధ్య ఏదో ఉందని త్వరలోనే, ఇద్దరూ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని, పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది.

సోషల్ మీడియాలో
నిజంగా వారిద్దరి మధ్య ఏదైనా ఉందో లేదో తెలియదు కానీ ఇప్పుడు ఈ వ్యవహారం మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పక తప్పదు. ఇకపోతే లాల్ సింగ్ చద్దా సినిమాను మెగాస్టార్ చిరంజీవి సమర్పణలో తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. తన కెరీర్ లో మొట్ట మొదటిసారిగా మెగాస్టార్ చిరంజీవి ఇలా సినిమాను సమర్పించడం గమనార్హం.


Click it and Unblock the Notifications











