రమ్యకృష్ణ మేడమ్ లేకపోతే.. అలా వచ్చేది కాదు.. నాగచైతన్య
సీనియర్ నటి రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం శైలజారెడ్డి అల్లుడు. ఈ చిత్రంలో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించారు. ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మారుతి దర్శకత్వంలో నాగవంశీ.ఎస్, పి.డి.వి.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబర్ 13న విడుదలవుతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ - ''అక్కినేని అభిమానులే మా బలం. వారి వల్లే నాకు ఎంకరేజ్‌మెంట్ దొరుకుతుంది. మీరిచ్చే ప్రేమకు హిట్ సినిమానే కోరుకుంటారు తప్ప.. మరేం కోరుకోరు. ఇప్పటి నుండి ప్రతి సినిమాకు అభిమానులను మైండ్‌లో పెట్టుకుంటాను.
అక్కినేని అభిమానులనీ గర్వపడేలా చేస్తానని మాట ప్రామిస్ చేస్తున్నాను. ఈ సినిమా అలాంటి సినిమా. మారుతిగారు సూపర్బ్ సినిమా ఇచ్చారు. నా కంటే మీకు ఏం కావాలనే దాన్ని మారుతిగారే ఎక్కువగా పట్టించుకుంటారు.

కొత్త బాడీ లాంగ్వేజ్, ఎనర్జీతో నన్ను ప్రెజంట్ చేసిన మారుతిగారికి థాంక్యూ సో మచ్. నా బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లు ఈ సినిమాను మారుతిగారు ప్లాన్ చేశారు. అందుకు ఆయనకు థాంక్స్. నాగవంశీ, పీడీపీ ప్రసాద్‌గారు రెండేళ్ల క్రితం నాకు మరచిపోలేని సినిమా ప్రేమమ్‌ను ఇచ్చారు.
రెండేళ్ల తర్వాత.. ఇప్పుడు మారుతిగారితో మంచి కాంబినేషన్‌ను సెట్ చేసి శైలజారెడ్డి చిత్రాన్ని అందిస్తున్నారు. ఈ జర్నీ వారితో ఇలాగే కంటిన్యూ అవుతుందనుకుంటున్నాను. రమ్యకృష్ణ మేడమ్ నుంచి మాకు బిగ్గెస్ట్ సపోర్ట్ వచ్చింది. రమ్య మేడమ్‌ను దృష్టిలో పెట్టుకునే మారుతిగారు నాకు ఈ కథను చెప్పారు. ఆవిడ చేయకుండా సినిమా ఇంత బాగా వచ్చేది కాదు.
హీరోయిన్‌గా చేసిన అను ఇమ్మాన్యుయేల్ ఈ సినిమాతో ఇంకా హైట్స్‌కి రీచ్ అవుతుంది. గోపీసుందర్‌గారు ప్రేమమ్ తర్వాత మరో సూపర్‌హిట్ ఆల్బమ్ ఇచ్చారు. కెమెరామెన్ నిజార్, సీనియర్ నరేష్, పృథ్వీ అందరికీ థాంక్స్. పండగక్కి పండగలాంటి సినిమా. అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది'' అన్నారు.


Click it and Unblock the Notifications











