ఒకేసారి ఆరు మంది దర్శకులను లైన్ లో పెట్టిన నాగచైతన్య.. అందరూ హిట్టు కొట్టిన దర్శకులే..
అక్కినేని యువ హీరో నాగచైతన్య ఇటీవల కాలంలో తన స్టార్ ఇమేజ్ తో పాటు బాక్సాఫీస్ మార్కెట్ రేంజ్ కూడా అమాంతంగా పెంచుకుంటున్నాడు. అతను ఎలాంటి సినిమాలు చేసినా కూడా బాక్సాఫీసు వద్ద గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ కూడా అందుకుంటున్నాడు. చివరగా లవ్ స్టోరీ సినిమా తో వచ్చిన నాగచైతన్య ప్రస్తుతం కెరీర్ లో మొదటి సారి డిఫరెంట్ లైనప్ తో ముందుకు సాగుతున్నాడు..ఏకంగా ఒకేసారి ఆరు మంది దర్శకులు లైన్లో పెట్టిన నాగచైతన్య త్వరలోనే వీలైనంత త్వరగా ఆ ప్రాజెక్టులను ఫినిష్ చేసే విధంగా ప్రణాళికలు రచిస్తున్నాడు. ఇక ఆ దర్శకుల వివరాల్లోకి వెళితే..

కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్
యువ హీరో నాగచైతన్య కొంతకాలంగా ఎలాంటి సినిమాలు చేస్తున్నా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకుంటున్నాడు. సమంతతో చివరగా చేసిన మజిలీ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఇక నాగచైతన్య సినిమా కెరీర్ లో కూడా అప్పటి వరకు అత్యధిక బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా కూడా మజిలీ సరికొత్త మార్కెట్ ను క్రియేట్ చేసింది.

ఆ సినిమాతో మరింతగా..
ఇక చివరగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేసిన లవ్ స్టోరీ కూడా మంచి విజయాన్ని అందుకుంది. సాయి పల్లవి సినిమాలో హీరోయిన్ గా నటించడం కూడా సినిమా కోసం చాలా బాగా ప్లస్ అయింది. అంతకు ముందే మ్యూజిక్ కూడా మంచి హైప్ క్రియేట్ చేసింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా కూడా భారీ స్థాయిలో వసూళ్లను అందుకోవడంతో నాగచైతన్య మార్కెట్ వ్యాల్యూ మరింత పెరిగింది.

ఆ దర్శకుడితో బ్యాక్ టూ బ్యాక్
ఇక ప్రస్తుతం నాగచైతన్య లిస్టులో ఆరుగురు టాలెంటెడ్ దర్శకుడు ఉన్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం లో థాంక్యూ అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నాడు. అంతేకాకుండా ఆ దర్శకుడుతోనే మరో వెబ్ ప్రాజెక్ట్ ను ప్లాన్ చేసుకున్న విషయం తెలిసిందే.

కిషోర్ తిరుమల - దానయ్య..
అలాగే లేడి డైరెక్టర్ నందిని రెడ్డి తో కూడా ఎప్పటి నుంచో ఒక సినిమాలు చేయాలని చర్చలు జరుపుతున్నారు. వీరికి సంబంధించిన కథ కూడా సెట్టయినట్లు సమాచారం. ఇటీవల ఆడవాళ్లు మీకు జోహార్లు ప్రమోషన్లలో కూడా దర్శకుడు కిషోర్ తిరుమల కూడా నాగచైతన్యతో ఓ సినిమా చేయబోతున్నట్లు అఫీషియల్గా క్లారిటీ ఇచ్చేశాడు.. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మించబోతున్నారు.
Recommended Video

ఫామ్ లో ఉన్న దర్శకులతో..
ఇక గత ఏడాది నాంది సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విజయ కనకమేడల, మజిలీ దర్శకుడు శివ నిర్వాణ, శ్యామ్ సింగరాయ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ ఇలా టాలెంటెట్ హిట్ దర్శకులు లైన్ లో ఉన్నారు. ఇక మానాడు రీమేక్ ను వెంకట్ ప్రబు దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. ఈ దర్శకులు అందరూ కూడా హిట్స్ అందుకొని ఫామ్ లో ఉన్నవారే. అలాగే సర్కారు వారి పాట దర్శకుడు పరశురామ్ కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











