Mahesh Babu ఫ్యాన్స్ కు సర్‌ప్రైజ్ సెట్ చేసిన నాగచైతన్య.. ఆ సినిమాలో ఒక్కడు, పోకిరి
అక్కినేని నాగచైతన్య తదుపరి సినిమా థాంక్యూ ఈనెల 22వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. దిల్ రాజు ప్రొడక్షన్లో టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఒక ఎమోషనల్ లైఫ్ జర్నీగా తెరపైకి రాబోతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ కూడా చాలా బిజీగా మారిపోయింది. అయితే రీసెంట్ గా క్లారిటీ ఒక దర్శకుడు సినిమాలో మహేష్ బాబుకు సంబంధించిన కొన్ని అంశాలు కూడా హైలెట్ కాబోతున్నట్లు తెలియజేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

వరుస విజయాలు
అక్కినేని నాగచైతన్య గత కొంతకాలంగా వరుస విజయాలతో తన మార్కెట్ ను పెంచుకుంటున్న విషయం తెలిసిందే. గత ఎడాది సాయి పల్లవితో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేసిన లవ్ స్టోరీ ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక తర్వాత తన తండ్రితో కలిసి బంగార్రాజు అనే సినిమాలో నటించిన నాగచైతన్య మరో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

సినిమాపై నమ్మకం
కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకుంటూ మార్కెట్ ను పెంచుకుంటున్న నాగచైతన్య ఇప్పుడు థాంక్యూ సినిమాతో కూడా మరో విజయాన్ని అందుకోవడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాపై ట్రైలర్ అయితే ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. ఇక సినిమా అవుట్ ఫుట్ చేసిన దిల్ రాజు కూడా మంచి నమ్మకంతోనే ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాను రెండు గంటల 9 నిమిషాల నిడివితో రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

పాజిటివ్ రియాక్షన్
అలాగే ఈ సినిమాను ఇటీవల కొంతమంది సినీ ప్రముఖులు కూడా వీక్షించడం జరిగింది. ఆ స్పెషల్ షో చూసిన వారిలో ప్రముఖ రచయిత దర్శకుడు BVS రవి కూడా ఉన్నారు. ఇక సినిమా చూసిన వెంటనే దర్శకుడు చాలా పాజిటివ్ గా సోషల్ మీడియాలో స్పందించారు. తప్పకుండా సినిమా అందరిని ఆకట్టుకుంటుంది అని ఈ సినిమాలో మంచి ఎమోషన్స్ ఉన్నాయి అని అన్నారు.

మహేష్ సినిమాలు
అలాగే ఈ సినిమాతో నాగచైతన్య మహేష్ బాబు అభిమానులకు కూడా ఒక మంచి సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్లుగా రచయిత రవి వివరణ ఇచ్చాడు. ఈ థాంక్ యూ సినిమాలో ఒక్కడు సినిమాతో పాటు దూకుడు పోకిరి సినిమాలకు సంబంధించిన రిఫరెన్సులు ఉంటాయి అని అన్నారు. ఆ సీన్స్ అన్నీ కూడా మహేష్ డై హార్స్ ఫ్యాన్స్ ఎంతగానో ఆకట్టుకుంటాయని కూడా చెప్పారు.

మహేష్ వీరాభిమానిగా చైతు
థాంక్ యూ సినిమాలో నాగచైతన్య మహేష్ బాబు వీరాభిమాని పాత్రలో కనిపించబోతున్నట్లు ముందుగానే ఒక క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పుడు సినిమాలో అభిమానులను ఎంతగానో కట్టుకునే కొన్ని సీన్స్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో నాగచైతన్య బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం అందుకుంటాడో చూడాలి. ఈ సినిమాలో రాశి ఖన్నా మెయిన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. అలాగే నాగచైతన్య విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో మరొక వెబ్ సిరీస్ చేస్తున్న విషయం తెలిసిందే. దూత అనే ఆ ప్రాజెక్టు అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. హారర్ కాన్సెప్ట్ లో రాబోతున్న దూతపై మంచి అంచనాలు ఉన్నాయి. మరి నాగచైతన్య ఆ కాన్సెప్ట్ లో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











