Naga Chaitanya: పెళ్లై రెండు నెలలు కాలేదు.. నాగచైతన్య ఇంతలా మారాడా..
అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) జంటగా తెరకెక్కిన సినిమా 'తండేల్' (Thandel). ఈ మూవీకి చందు మొండేటి దర్శకత్వం వహించగా.. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించారు. మత్య్సకారులు జీవన విధానం ఆధారంగా తెరకెక్కించారు. కాగా ఈ చిత్రం లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడడంతో మూవీ టీమ్ ప్రమోషన్ల జోరు పెంచింది. ఈ క్రమంలో నాగ చైతన్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సతీమణి శోభితా ధూళిపాళ్ల పై షాకింగ్ కామెంట్స్ చేశారు.
యథార్థ ఘటనల ఆధారంగా రూపుదిద్దుకున్న తండేల్ విడుదల ఎప్పుడంటూ అక్కినేనీ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. తండేల్ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తుంది. నాగ చైతన్య కెరీర్ లో ఇదే హైయెస్ట్ బడ్జెట్ మూవీ. ఇప్పటికే సినిమా విడుదల ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి. పాన్ ఇండియా లెవల్ లో అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే విడుదలపై పోస్టర్స్,గ్లింప్స్, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ మూవీ మేకర్స్ ప్రమోషన్స్‌ని వేగవంతం చేస్తున్నారు.

ప్రమోషన్స్ లో భాగంగా నాగ చైతన్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తండేల్ మూవీ ముచ్చట పంచుకున్నారు. ఈ సినిమాను ఎక్కువ భాగం విశాఖపట్నం (వైజాగ్), శ్రీకాకుళం, ఉడిపిలలో చిత్రీకరించమని తెలిపారు. తన కెరీర్ లో మూవీతో కచ్చితంగా సక్సెస్ అందుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమయంలో నాగ చైతన్య తన జీవిత భాగస్వామి శోభిత పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
నాగ చైతన్య మాట్లాడుతూ.. తన భార్య శోభితతో జీవితంలోని ప్రతీ విషయాన్ని పంచుకుంటాననీ, ప్రతి విషయంలోనూ శోభితా సలహాలు, సూచనలను పాటిస్తాని తెలిపారు. శోభిత నిర్ణయాలను తాను గౌరవిస్తానని చైతన్య తెలిపారు. తాను అయోమయంలో ఉన్నప్పుడు శోభితా ఎంతో సపోర్టుగా ఉంటుందని, సరైన సూచనలు ఇస్తుందని వెల్లడించారు. అలాగే.. శోభితా తన జీవిత భాగస్వామి కావడం, ఆమెతో జీవితం పంచుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.
అలాగే శోభితతో ప్రతి విషయమూ షేర్ చేసుకోవడం తనకు చాలా ఇష్టమన్నారు. తన ఆలోచనలన్నింటినీ తనతో పంచుకుంటానని చెప్పారు. ఎదైనా టెన్షన్ గా.. గందరగోళ పరిస్థితులను ఎదుర్కున్నప్పుడు ఆమెను సంప్రదిస్తానన్నారు. శోభితాతో మాట్లాడితే.. తన మూడ్ మారిందని, ఆమె వెంటనే అర్థమైపోతుందని అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

పెద్దల అంగీకారంతో నాగ చైతన్య -శోభితా లు డిసెంబర్ 4 న మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. శోభితా ధూళిపాళ్ల 2013లో ఫెమినా మిస్ ఇండియా విన్నర్. ఆ తరువాత సినీ రంగ ప్రవేశం చేశారు. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ కూడా నటిస్తున్నారు. తనకంటూ ప్రత్యేకం గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ కావడంతో మనోడు రెండు నెలలు కాకముందే చాలా మారిపోయాడంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.


Click it and Unblock the Notifications











