Don't Miss!
- Sports
IND vs SA: రెండో ఇన్నింగ్స్‌లోనూ విరాట్ కోహ్లీ విఫలం.. భారీ ఆధిక్యం దిశగా భారత్!
- News
ఇద్దరు ఉగ్రవాదులను పట్టుకున్ని గ్రామస్తులు: ఒకరు మాజీ బీజేపీ మైనార్టీ నేత, రూ. 5 లక్షల రివార్డ్
- Finance
Axis Mutual Fund: యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ పై దావా వేసిన మాజీ ఫండ్ మేనేజర్.. ఎందుకంటే..?
- Technology
BSNL కొత్తగా మూడు ప్రీపెయిడ్ ప్లాన్లను జోడించింది!! ఆఫర్స్ మీద ఓ లుక్ వేయండి...
- Automobiles
2022 జూన్ అమ్మకాల్లో స్వల్ప వృద్ధి: హీరో మోటోకార్ప్
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జూలై 03 నుండి జూలై 9వ తేదీ వరకు..
- Travel
మన్యంలో మరుపురాని దృశ్యాలు రెండవ భాగం -2
Thankyou Movie Teaser: కాంప్రమైజ్ అయ్యేదే లేదు.. అదరగొట్టిన నాగచైతన్య!
అక్కినేని యువ హీరో నాగచైతన్య మరొక విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మనం సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం లోనే నాగచైతన్య రెండవసారి చేస్తున్న ప్రయోగాత్మక చిత్రం థాంక్యూ. ఈ సినిమాపై మొదట్లో అయితే అంచనాలు బాగానే ఏర్పడ్డాయి కానీ మధ్యలో ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా వాయిదా పడడంతో జనాలు మళ్లీ మర్చిపోయే పరిస్థితికి వచ్చింది అనే కామెంట్స్ వచ్చాయి. కానీ చిత్ర యూనిట్ మళ్లీ ప్రమోషన్స్ డోస్ పెంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
థాంక్యూ సినిమాకు సంబంధించిన టీజర్ ను కొద్ది సేపటి క్రితం విడుదల చేయగా సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. యూట్యూబ్ లో విడుదలైన కొద్దిసేపటికే భారీ స్థాయిలో వ్యూవ్స్ వచ్చాయి. నాగచైతన్య థాంక్యూ సినిమాలో ఒక విభిన్నమైన క్యారెక్టర్తో కనిపిస్తున్నట్లు అర్థమవుతోంది. మంచి కాన్సెప్ట్ సినిమాలను తెరపైకి తీసుకువచ్చే దర్శకుడు విక్రమ్ కె.కుమార్ థాంక్యూ సినిమాలో నాగచైతన్యను మూడు విభిన్నమైన రకాల షేడ్స్ తో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఒక హాకీ ప్లేయర్ గా అలాగే మరొక సక్సెస్ ఫుల్ బిజినెస్మేన్గా కూడా నాగచైతన్య సినిమాలో కనిపించబోతున్నట్లు అనిపిస్తోంది. లైఫ్ లో అస్సలు కాంప్రమైజ్ కానీ క్యారెక్టర్లో నాగ చైతన్య కనిపిస్తున్నాడు. జీవిత ఆశయానికి సంబంధించి ఎలాంటివి వదులుకోకూడదు అని మనకు నచ్చింది చేయాలని, అందులో ఎలాంటి కాంప్రమైజ్ కాకూడదని ఈ సినిమాతో చెప్పబోతున్నట్లు అర్థమవుతుంది.
Join us in our journey to say Thank You!
— Sri Venkateswara Creations (@SVC_official) May 25, 2022
Presenting #𝐓𝐡𝐚𝐧𝐤𝐘𝐨𝐮𝐓𝐞𝐚𝐬𝐞𝐫 https://t.co/VVNw74zld4@chay_akkineni @RaashiiKhanna_@Vikram_K_Kumar @MusicThaman @pcsreeram @BvsRavi #MalavikaNair @avika_n_joy @SaiSushanthR @SVC_official @adityamusic#ThankYouTheMovie pic.twitter.com/nvyBVqIM31
థాంక్యూ టీజర్ అయితే మొత్తానికి చాలా కొత్తగా అనిపిస్తుంది అన్నట్లుగా నెటీజన్స్ కామెంట్ చేస్తున్నారు. విక్రమ్ కె కుమార్ కాన్సెప్ట్ విషయాలలో అయితే ఇప్పుడు ప్రేక్షకులను నిరాశ పరిచింది లేదు. థాంక్యూ సినిమాతో కూడా అదే తరహాలో ఆకట్టుకుంటాడు అనిపిస్తోంది. ఇక థాంక్యూ సినిమాలో రాశి ఖన్నా తో పాటు అవికా గోర్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తోంది. క్యూట్ లవ్ స్టోరీ తో పాటు పవర్ఫుల్ క్యారెక్టర్తో కొనసాగే ఎమోషనల్ జర్నీ కూడా థాంక్యూ సినిమాలో అద్భుతంగా ఉంటుందట. మరి థాంక్యూ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. దిల్ రాజు ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న థాంక్యూ సినిమాను హర్షిత్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఇక సినిమాను జూలై 8 న విడుదల చేయనున్నారు.