ఊహించని పాత్రలో నాగ చైతన్య: యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సిద్ధమవుతోన్న అక్కినేని హీరో

'జోష్' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు అక్కినేని వారసుడు నాగ చైతన్య. బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ.. కెరీర్ ఆరంభం నుంచే కష్టంతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను దక్కించుకోడానికి ఎంతగానో కష్టపడుతున్నాడీ హీరో. అందుకే మొదట్లోనే పలు విజయాలను అందుకున్నాడు. మధ్యలో కొన్ని పరాజయాలు పలకరించినా ఏమాత్రం నిరాశకు లోనవకుండా ముందుకు సాగాడు. ఈ క్రమంలోనే 'మజిలీ', 'వెంకీ మామ' వంటి విజయాలను అందుకుని ఫుల్ ఫామ్‌లోకి వచ్చాడు. ఈ జోష్‌లో వరుసగా చిత్రాలను ఒప్పుకుంటున్నాడు.

ప్రస్తుతం 'లవ్ స్టోరీ' అనే సినిమా చేస్తున్న నాగ చైతన్య.. దీని తర్వాత విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ' అనే మూవీ చేయనున్నాడు. త్వరలోనే ఈ మూవీ పట్టాలపైకి వెళ్లనుంది. అలాగే, 'పెళ్లి చూపులు' దర్శకుడు తరుణ్ భాస్కర్‌తోనూ ఓ సినిమాకు కమిట్ అయ్యాడు చైతూ. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో అక్కినేని హీరో.. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో ఇది తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. గతంలో 'సాహసం శ్వాసగా సాగిపో'లో చైతూ పోలీస్‌గా చేశాడు.

Naga Chaitanya to play Police Role in Tharun Bhascker Movie

మరోవైపు, తరుణ్ భాస్కర్.. విక్టరీ వెంకటేష్‌తో సినిమా చేయబోతున్నాడు. అది కొన్ని రోజుల్లోనే మొదలై.. సింగల్ షెడ్యూల్‌లో పూర్తవుతుందని అంటున్నారు. ఈ మూవీ షూటింగ్ అయిపోయిన తర్వాత నాగ చైతన్య సినిమా మొదలవుతుందని సమాచారం. ఇదిలా ఉండగా.. క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య నటించిన చిత్రం 'లవ్ స్టోరీ'. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలపై కే నారాయణదాస్ నారంగ్, పీ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్. ఏప్రిల్ 16న ఇది రిలీజ్ కాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X