For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  NC22: ముంబై పిల్లతో నాగ చైతన్య రొమాన్స్.. అక్కినేని ఫ్యామిలీతోనే మొదలు

  |

  అక్కినేని నాగార్జున కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన శైలి టాలెంట్‌తో చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు యువ సామ్రాట్ నాగ చైతన్య. కెరీర్ ఆరంభంలోనే పలు విజయాలను ఖాతాలో వేసుకున్న అతడు.. ఆ తర్వాత వరుస పెట్టి ఎన్నో ఫ్లాపులను చవి చూశాడు. ఇలాంటి పరిస్థితుల్లో శివ నిర్వాణ తెరకెక్కించిన 'మజిలీ' అనే మూవీతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. అక్కడి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా వరుసగా 'వెంకీ మామ', 'లవ్ స్టోరి', 'బంగార్రాజు' వంటి హిట్లను అందుకున్నాడు. ఇలా వరుస సక్సెస్‌లు రావడంతో నాగ చైతన్య రెట్టించిన ఉత్సాహంతో ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు.

  హాట్ డోస్ పెంచేసిన అనన్య నాగళ్ల: ఆ పార్టును హైలైట్ చేస్తూ యమ ఘాటుగా!

  ప్రస్తుతం యువ సామ్రాట్ నాగ చైతన్య.. వినూత్న చిత్రాల దర్శకుడిగా పేరొందిన విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ' అనే సినిమాను చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. దీనితో పాటు నాగ చైతన్య 'లాల్ సింగ్ చద్దా' అనే హిందీ మూవీలోనూ నటించాడు. ఆమిర్ ఖాన్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో ఈ యంగ్ హీరో.. దాదాపు 20 నిమిషాల పాటు ఉండే ఓ తెలుగు కుర్రాడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ షూట్ కూడా పూర్తైంది. ఇక, ఇప్పుడు ఈ అక్కినేని హీరో 'ధూత' అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోన్న విషయం తెలిసిందే.

  వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్న నాగ చైతన్య ఇటీవలే తన 22వ ప్రాజెక్టును ప్రకటించాడు. దీన్ని కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రూపొందించబోతున్నారు. వినూత్నమైన సబ్జెక్టుతో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం నాగ చైతన్య వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో పాటు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ బ్యాలెన్స్ ఉండడంతో దీన్ని కొద్ది రోజుల తర్వాత మొదలెట్టబోతున్నారు. అప్పటి నుంచి ఏమాత్రం విరామం తీసుకోకుండా వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు.

  Ashu Reddy: అషు రెడ్డి వీడియోపై ట్రోల్స్.. అది తీసేసి చూపించు అంటూ దారుణంగా!

  Naga Chaitanya to Romance with Sakshi Vaidya in NC22

  క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో నాగ చైతన్య సరసన నటించే హీరోయిన్ ఎవరన్న దానిపై చాలా రకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది నటీమణుల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీలో సాక్షి వైద్య అనే ముంబై భామను తీసుకున్నారని తెలిసింది. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన ఈ భామ.. ఇప్పటికే అక్కినేని అఖిల్ నటిస్తోన్న 'ఏజెంట్' మూవీలో భాగం అయింది. అది షూటింగ్ జరుపుకుంటూ ఉండగానే ఇప్పుడు అదే ఫ్యామిలీకి చెందిన మరో హీరో మూవీకి కూడా సెలెక్ట్ అయింది. దీంతో ఈ బ్యూటీ హాట్ టాపిక్ అయిపోతోంది.

  ద్విభాషా చిత్రంగా రాబోతున్న ఈ మూవీలో నాగ చైతన్య పాత్ర ఎంతో కొత్తగా ఉండబోతుందని తెలుస్తోంది. దీంతో అతడి అభిమానులు దీని కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా వెంకట్ ప్రభు - నాగ చైతన్య కలయికలో రూపొందనున్న ఈ సినిమాను పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. ఇక, ఈ సినిమాలో పని చేసే టెక్నీషియన్లు, నటీ నటుల వివరాలు త్వరలోనే వెల్లడించబోతున్నారు.

  English summary
  Akkineni Naga Chaitanya Recently Started His 22nd Movie With Venkat Prabhu. He Will Romance with Sakshi Vaidya in This Film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X