ఏయ్ ఏం రికార్డ్ చేస్తున్నావ్ అంటూ నాగచైతన్య కంగారు.. ఫ్యాన్స్ హ్యాపీ!
అక్కినేని హీరో నాగచైతన్య బంగార్రాజు సినిమాతో ఈ ఏడాది సంక్రాంతికి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా సక్సెస్ లో నాగార్జున పాత్ర కూడా ఎంతగానో ఉంది. అయితే ఇప్పుడు సోలోగా నాగచైతన్య బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడానికి సిద్ధమవుతున్నాడు. మనం దర్శకుడు విక్రమ్ కె.కుమార్ తో నాగచైతన్య చేస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ థాంక్ యూ సినిమాను విడుదల చేయాలని ఇటీవల ఒక నిర్ణయానికి వచ్చారు.
అసలైతే థాంక్ యూ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ అలాగే ఇతర సినిమాల రిలీజ్ డేట్స్ క్లాష్ కావడం వలన ప్రేక్షకులు మరచిపోయే వరకు వచ్చింది. ఇక మొత్తానికి థాంక్ యూ సినిమా రెగ్యులర్ ప్రమోషన్స్ ను కూడా మొదలు పెట్టాలి అని దర్శకుడు ఒక నిర్ణయానికి వచ్చాడు.

దిల్ రాజు థాంక్ యూ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే థాంక్ యూ సినిమా సంబంధించిన ఒక ప్రత్యేకమైన అప్డేట్ కూడా ఇచ్చారు. అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతొంది. నాగచైతన్య డబ్బింగ్ చెబుతూ ఉండగా ఎవరో రికార్డ్ చేస్తున్నట్లు అనిపించింది. దీంతో ఏం చేస్తున్నావు అని కాస్త కంగారు పడ్డాడు. అయితే టీజర్ అప్డేట్ కోసం అని దర్శకుడు చెప్పడంతో నాగచైతన్య తో పాటు ఫ్యాన్స్ కూడా ఒక విధంగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనే చెప్పాలి.
ఎందుకంటే థాంక్ యూ సినిమా కోసం ఓ వర్గం అక్కినేని అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా మొదటి టీజర్ ను మే 25 సాయంత్రం 5:04 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చారు. మరి ఆ టీజర్ ఏవిధంగా ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ సినిమాలో నాగచైతన్య కు జోడిగా రాశి ఖన్నా మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా మరొక ముఖ్యమైన పాత్రలో అవికా గోర్ నటించింది. ఇక థాంక్ యూ సినిమాను జూలై 8 వ తేదీన విడుదల చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











