twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Thankyou First Review: నాగచైతన్య సినిమాపై ప్రముఖ రైటర్ స్పెషల్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

    |

    నాగచైతన్య రాశి ఖన్నా హీరో హీరోయిన్ గా నటించిన థాంక్యూ సినిమా ఈనెల 22వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. దిల్ రాజు ప్రొడక్షన్లో నిర్మించిన ఈ సినిమాకు మనం దర్శకుడు విక్రమ్ కే కుమార్ డైరెక్ట్ చేశాడు. ఇక ఈ సినిమాపై ఇప్పటికే టీజర్ తో పాటు సాంగ్స్ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు కొంతమంది సినీ ప్రముఖులకు కూడా ప్రత్యేకంగా చూపించినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రముఖ రచయిత దర్శకుడు బివిఎస్ రవి సినిమాపై తన మొదటి రివ్యూను అందించాడు.

    ఇప్పుడే సినిమాను చూసాను అంటూ థాంక్యూ మూవీ ఫైనల్ కట్ చాలా బాగుంది అని నాగచైతన్య చేసిన అభిరామ్ పాత్ర అతని కెరీర్ లోనే చాలా అత్యుత్తమమైనది అంటూ ఇది మనందరికీ విస్మయపరచే అనుభూతిని ఇస్తుంది అని అన్నారు. ఇక చైతు అభిమానులకి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది అని కూడా హామీ ఇస్తున్నట్లు బివిఎస్ రవి సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చాడు.

    Naga chaitanya upcoming movie Thankyou First Review

    అలాగే మరి కొంతమంది దర్శక నిర్మాతలు కూడా ఈ సినిమాపై చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది. దిల్ రాజు అలాగే చిత్ర యూనిట్ సభ్యులందరు కూడా సినిమా అవుట్ ఫుట్ పై కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాను గత నెలలోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఇతర సినిమాలు ముందే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోవడం వలన క్లాష్ అవుతుంది అని సోలోగా విడుదల చేసేందుకు దిల్ రాజు డిసైడ్ అయ్యాడు.

    మొత్తానికి జూలై 22వ తేదీన సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఇంతకుముందు సినిమాలతో నాగచైతన్య బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమాతో పాటు అలాగే బంగార్రాజు సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకున్నాయి. ఇక ఇప్పుడు అందరి ఫోకస్ కూడా థాంక్యూ సినిమా పైన పడింది ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలి అని నాగచైతన్య అనుకుంటున్నాడు. ఇక రాశికన్నాతో అతను బిజీబిజీగా ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటున్నాడు. మరి సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

    English summary
    Naga chaitanya upcoming movie Thankyou First Review,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X