అక్కినేని హీరోల్లో అతనొక్కడే.. ఒకేసారి రెండు సినిమాలతో..
అక్కినేని హీరోల్లో నాగ చైతన్య ఒక్కడే కాస్త ఎక్కువ సినిమాలు చేస్తున్నాడని చెప్పాలి. అలాగే మినిమమ్ హిట్స్ అందుకుంటూ స్టార్ దర్శకులతో పని చేసే ఛాన్స్ దక్కించుకుంటున్నాడు. సమంతతో మజిలీ సినిమా చేసి తన సక్సెస్ రేంజ్ ని మరింత పెంచుకున్న ఈ యువ హీరో వీలైనంత వరకు బాక్సాఫీస్ హిట్స్ అందుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీని రిలీజ్ చేయడానికి దగ్గరలో ఉన్న సంగతి తెలిసిందే.
కరోనా గోల లేకుంటే ఈ ఏడాది మరో సినిమాను రిలీజ్ చేసేవాడట. ఇప్పటికే లవ్ స్టోరీ సినిమా దాదాపు ఏండింగ్ కి వచ్చేసింది. ఇంకాస్త షూటింగ్ అయిపోతే రిలీజ్ చేయడానికి సిద్ధమవుతారు. అయితే అప్పట్లో ఆ షూటింగ్ ఎండ్ అయ్యేలా లేదు. ఒక వేళ షూటింగ్ స్టార్ట్ అయితే ఆ సినిమా ఎండ్ అవ్వగానే వెంటనే మరో రెండు సినిమాలను స్టార్ట్ చేయనున్నాడట. ఇదివరకే మనం దర్శకుడు విక్రమ్ కుమార్ ఒక స్క్రిప్ట్ లాక్ చేసుకున్న విషయం తెలిసిందే.

అలాగే మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో కూడా ఒక సినిమాను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడట. రెండు సినిమాలను ఒకేసారి పట్టాలెక్కించాలని వీలైతే వచ్చే ఏడాది బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ ని రిలీజ్ చేయాలని నాగ చైతన్య ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే మరో రెండు కథలను కూడా వెయిటింగ్ లిస్ట్ లో పెట్టినట్లు తెలుస్తోంది. మరి ఆ సినిమాలతో ఈ హీరో ఎలాంటి విజయాల్ని అందుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











