సమంత కంటే ముందు ఆ స్టార్ హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో చైతూ.. కానీ ఆ ఒక్క ఫంక్షన్ వల్లే ఇలా!
విడిపోతున్నట్లు ప్రకటించినప్పటి నుంచి నాగచైతన్య మరియు సమంతల విడాకుల కథ గురించి సోషల్ మీడియాలో ఎక్కువ చర్చ జరుగుతోంది. ఈ జంట గురించి, విడాకుల వ్యవహారంలో ఎక్కువ శాతం సమంత పైనే గురిపెట్టారు. ఎందుకో ఆమెనే టార్గెట్ చేసి తప్పంతా ఆమెదే అన్నట్టు ఫోకస్ చేశారు. అయితే ఇప్పుడు తాజాగా ఒక సంచలన అంశం తెరమీదకు వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

పెళ్లి చేసుకోవడానికి
బాలీవుడ్ మీడియా పోర్టల్ ఒకటి నాగ చైతన్య గురించి ఎప్పుడూ లేని ఒక రూమర్‌ని ప్రచారం చేయడం మొదలు పెట్టింది. ఒక టాప్ బాలీవుడ్ మీడియా పోర్టల్ నుండి వచ్చిన నివేదిక ప్రకారం, సమంతను పెళ్లి చేసుకోవడానికి ముందు చైతన్య తెలుగు సినిమాల్లో ఇప్పటికీ చురుకుగా ఉన్న స్టార్ హీరో కుమార్తె, స్టార్ హీరోయిన్ అయిన ఒకామెతో రిలేషన్ లో ఉన్నారట.

స్టార్ కుమార్తెను వివాహం
ఈ నివేదిక ప్రకారం, చైతన్య స్టార్ కుమార్తెను వివాహం చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నాడు కానీ ఎందుకో అది విఫలం అయింది అని, ఆ తరువాత ఆయన సమంతతో సెటిల్ అయ్యాడని వెల్లడించారు. ఆమె బాలీవుడ్ సినిమాలు సహా తెలుగు, తమిళ సినిమాల్లో కూడా సత్తా చాటింది. ఇంతకీ ఆమె ఎవరో అనుకుంటున్నారా? శృతి హాసన్.

హ్యాపీ రిలేషన్‌షిప్‌లో
సమంతా రూత్ ప్రభుతో రిలేషన్ లోకి వెళ్ళడానికి కి ముందు, నాగ చైతన్య కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్‌తో చాలా హ్యాపీ రిలేషన్‌షిప్‌లో ఉన్నాడని వాళ్ళు పెళ్లి కూడా చేసుకోవాలనుకోగా అది ఎందుకో కుదరలేదు. నాగ చైతన్య మరియు శ్రుతి హాసన్ 2013 లో ఒకరినొకరు కలుసుకున్నారని, అప్పుడే వారు మంచి స్నేహితులయ్యారని వెల్లడించారు.

బాండ్ బలపడి
కానీ తర్వాత విషయాలు వేగంగా మారగా, తక్కువ సమయంలో వీరి బాండ్ బలపడిందని, ఆ సమయంలో శ్రుతి- నాగ చైతన్య ఒకరినొకరు ఎంతగానో ప్రేమించుకున్నారని, వారు కలిసి ఉండకుండా గడిపిన రోజు కూడా లేదని నివేదికలో పేర్కొన్నారు. అయితే ఈ సమయంలోనే వారి పెళ్లి పుకార్లు మీడియాలో చక్కర్లు కొట్టడం ప్రారంభించాయి.

చెల్లి వల్లే ఇలా
అయితే, ఇక్కడ ఇద్దరి మధ్య ఎందుకు దూరం పెరిగింది అంటే దానికి కారణం శృతి హాసన్ చెల్లెలు అని అంటున్నారు. నాగ చైతన్య, శ్రుతి హాసన్, ఆమె చెల్లెలు అక్షర హాసన్‌తో కలిసి ఓ అవార్డ్ ఫంక్షన్ కి వెళ్లినట్లు సమాచారం. ఈ అవార్డ్ ఫంక్షన్ సమయంలో, శృతి హాసన్ స్టేజ్ మీద డ్యాన్స్ వేయాల్సి వచ్చింది. ఆమె తిరిగి వచ్చే వరకు తన చెల్లెలిని జాగ్రత్తగా చూసుకోమని నాగచైతన్యను కోరిందట.
Recommended Video

అక్కకు అప్పగించకుండానే
అయితే, శృతి సోదరి అక్షర హాసన్ ను ఆమె అక్కకు అప్పగించకుండానే నాగ చైతన్య అవార్డ్ ఫంక్షన్ నుంచి వెళ్ళిపోయాడట. అందుకే వాళ్ళు విడిపోయారు అని ప్రచారం. అయితే నిజానికి వ్యూయర్‌షిప్‌ను పొందేందుకు కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలను వండి వడ్డించడం సర్వ సాధారణం అయింది. మరి ఈ విషయం కూడా అలాంటిదేనా? లేక నిజం గానే జరిగిందా? అంటే ఎవరూ సమాధానం చెప్పలేని పరిస్థితి.


Click it and Unblock the Notifications











