కరోనా సమయంలో ఆ దేశానికి నాగ చైతన్య: ‘థ్యాంక్యూ’ చెప్పేందుకే ఈ టూర్

కెరీర్ ఆరంభం నుంచే వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య. తద్వారా జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసే హీరోల్లో ఒకడిగా పేరొందాడు. ఇప్పటికే టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'లవ్ స్టోరీ' అనే సినిమాలో నటించిన అతడు.. అది పట్టాలపై ఉండగానే మరికొన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నాడు. అందులో విక్రమ్ కే కుమార్ రూపొందించే 'థ్యాంక్యూ' ఒకటి. ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో రాబోతున్న ఈ వినూత్న చిత్రం కోసం నాగ చైతన్య తాజాగా విదేశీ పర్యటనకు వెళ్లాడు.

'మనం' వంటి సూపర్ డూపర్ హిట్ మూవీ తర్వాత నాగ చైతన్య - విక్రమ్ కుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం 'థ్యాంక్యూ'. ఈ మూవీ షూటింగ్ తూర్పుగోదావరి జిల్లా లంక గ్రామాల్లో చాలా రోజుల పాటు జరిగింది. అక్కడ హీరోపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పుడు మరో షెడ్యూల్ కోసం నాగ చైతన్య అండ్ టీమ్ ఇటలీ పయనమైంది. అక్కడ దాదాపు పదిహేను రోజుల పాటు చిత్రీకరణ జరగనుందని తెలుస్తోంది. ఒకపక్క కరోనా వల్ల తెలుగు సినీ ఇండస్ట్రీలోని షూటింగులు ఆగిపోతుంటే.. ఈ అక్కినేని హీరో మాత్రం ధైర్యం చేసి ముందడుగు వేశాడు.

Naga Chaitanya went Italy for Thank You Movie

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'థ్యాంక్యూ'లో నాగ చైతన్య రెండు విభిన్నమైన గెటప్‌లతో కనిపించనున్నాడు. అంతేకాదు, ఇందులో అతడు మహేశ్ బాబు అభిమానిగా నటిస్తున్నాడు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థపై బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రైటర్ కమ్ డైరెక్టర్ బీవీఎస్‌ రవి కథ, మాటలు అందిస్తున్నారు. థమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. రాశీ ఖన్నా, మాళవికా నాయర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో హీరోయిన్‌ అవికా గోర్ కీలక పాత్రను పోషిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X