Don't Miss!
- News చంద్రబాబు , భువనేశ్వరి ఆస్తుల్లో భారీ పెరుగుదల - 5 ఏళ్ల కాలంలోనే..!!
- Sports ధోనీ సార్ ధోనీ.. అంతే: సౌండ్ లెవెల్ ఏ రేంజ్లో ఉందంటే..
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
‘లవ్ స్టోరీ’తో రికార్డు క్రియేట్ చేసిన నాగ చైతన్య: కెరీర్లోనే తొలిసారి భారీ స్థాయిలో ఇలా!
అక్కినేని ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ప్రవేశించినా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు యువ సామ్రాట్ నాగ చైతన్య. కెరీర్ ఆరంభంలోనే కొన్ని విజయాలను అందుకున్న అతడు.. ఆ తర్వాత చాలా కాలం పాటు సరైన హిట్ దొరకక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే 'మజిలీ', 'వెంకీ మామ' వంటి విజయాలను అందుకుని ఫుల్ ఫామ్‌లోకి వచ్చాడు. రెండు వరుస హిట్లతో ఫుల్ జోష్ మీదున్న నాగ చైతన్య ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో 'లవ్ స్టోరీ' అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ గురించి ఓ న్యూస్ లీకైంది.
తాజా సమాచారం ప్రకారం.. 'లవ్ స్టోరీ' మూవీ బిజినెస్‌ను భారీ స్థాయిలో జరుగుతుందట. ఇప్పటికే శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్, హిందీ డబ్బింగ్ హక్కులు అమ్ముడు పోయాయని తెలుస్తోంది. వీటన్నింటికీ కలిపి రూ. 16 కోట్లు వచ్చినట్లు తెలిసింది. ఇది నాగ చైతన్య కెరీర్లోనే అత్యధికంగా జరిగిన బిజినెస్ అని సమాచారం. అయితే, ఆ హక్కులను ఎవరు దక్కించుకున్నారన్న దానిపై మాత్రం క్లారిటీ రావడం లేదు. ఇక, ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కూడా భారీ మొత్తానికే అమ్ముడు పోయే అవకాశాలు ఉన్నాయని, ఇప్పటికే దీని కోసం కొందరు పోటీ పడుతున్నారని టాక్.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య - సాయి పల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం 'లవ్ స్టోరీ'. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలపై కే నారాయణదాస్ నారంగ్, పీ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పవన్ సీహెచ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నాడు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఇటీవల మూవీ టీజర్‌ను విడుదల చేశారు. దీనికి తెలుగు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది.