Naga Chaitanya's Net Assets: నాగచైతన్య సంపద ఎన్ని వందల కోట్లో తెలుసా? శోభిత ఆస్తుల విలువ ఎంతంటే?
యువ సామ్రాట్ నాగచైతన్య, యువ హీరోయిన్ శోభితా ధూళిపాల ఎంగేజ్‌మెంట్ వార్త జాతీయ మీడియాను కుదిపేసింది. గత కొద్దికాలంగా వీరిద్దరి డేటింగ్, అఫైర్ వ్యవహారం మాత్రం మీడియాకు హాట్ టాపిక్‌గా మారింది. అయితే శోభిత గానీ, చైతన్య గానీ ఎలాంటి హింట్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఈ క్రమంలో వారిద్దరి వ్యవహారం డేటింగ్ వరకే పరిమితమవుతుందని భావించారు. కానీ చడీచప్పుడు కాకుండా ఏకంగా ఎంగేజ్‌మెంట్‌ను నాగార్జున అధికారికంగా ప్రకటించే సరికి అందరూ షాక్ అయ్యారు. అయితే ఈ క్రమంలో చైతూ, శోభితా ఆస్తుల వివరాల్లోకి వెళితే..
సమంత రుత్ ప్రభుతో విభేదాలు పరిష్కరించుకోలేనంతగా ఉండటంతో నాగచైతన్య విడాకులు తీసుకోన్నారు. ఆమెతో విడిపోతున్నట్టు అక్టోబర్ 2వ తేదీ 2021 సంవత్సరంలో ప్రకటించారు. అప్పటి నుంచి శోభితా ధూళిపాలతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి.

నాగచైతన్యతో సమంత వివాహం బ్రేకప్ అయిన తర్వాత ఎవరికి వారు వారు తమ రిలేషన్స్‌ను కొనసాగిస్తున్నారు. సినిమాలు, ఇతర వ్యవహారాలతో బిజీగా మారిపోయారు. సమంతతో బ్రేకప్ జరిగిన 3 ఏళ్ల తర్వాత చైతన్య రెండో పెళ్లికి సిద్దమయ్యారు. అయితే బాలీవుడ్‌లో రాణిస్తున్న శోభితా ధూళిపాలను చేసుకొనేందుకు రెడీ అయ్యారు.
ఇక అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలకు చెందిన నాగచైతన్యకు తరగని రీతిలో ఆస్తులు ఉన్నాయి. తల్లిదండ్రులు నాగార్జున,లక్ష్మీ విడాకులు తీసుకోవడంతో నాగచైతన్య తాత వద్ద, దగ్గుబాటి ఫ్యామిలీ సంరక్షణలో పెరిగారు. అయితే ఈ రెండు ఫ్యామిలీ నుంచి కూడా చైతూకు భారీగా ఆస్తులు లభించాయి.
నాగచైతన్య నిశ్చితార్థం నేపథ్యంలో ఆయన ఆస్తుల వివరాలు చర్చనీయంశమయ్యాయి. అక్కినేని, దగ్గుబాటి కుటుంబాల నుంచి సంక్రమించిన ఆస్తులతోపాటు తన కెరీర్ పరంగా, తన బిజినెస్ పరంగా కూడ బెట్టిన ఆస్తులు మొత్తంగా 155 కోట్ల నుంచి 160 కోట్ల మధ్య ఉంటాయని వెల్లడించారు. టాలీవుడ్ హీరోల్లో అత్యధిక ఆస్తులు కలిగిన ఒకరిలో చైతూ ఒకరని పేర్కొంటున్నారు.

ఇక శోభితా ధూళిపాల విషయానికి వస్తే.. చైతూతో పోల్చుకొంటే సాధారణమైన ఆస్తులే ఉన్నాయి. ఆమె నటిగా, కుటుంబం నుంచి వచ్చిన ఆస్తుల వివరాల్లోకి వెళితే.. సుమారుగా 10 కోట్ల రూపాయల నికర ఆస్తులు ఉన్నట్టు సమాచారం. ఇద్దరి ఆస్తులు కలిపితే మొత్తంగగా 170 కోట్ల మేర ఉంటాయనేది ఇండస్ట్రీలో టాక్.
నాగచైతన్య, శోభితా కెరీర్ వివరాల్లోకి వెళితే.. చైతూ తాజాగా తండేల్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. తాజాగా కస్టడీ మూవీ, ధూత వెబ్ సిరీస్‌లో నటించారు.


Click it and Unblock the Notifications











