హీరో నాగశౌర్య చేజారిన మరో చిత్రం!
యువ హీరో నాగశౌర్య ఛలో చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ చిత్రం నాగశౌర్య కెరీర్ కు ఉత్సాహాన్ని ఇచ్చింది. కానీ ఈ చిత్రం తర్వాత నాగ శౌర్య తన సక్సెస్ ని కొనసాగించలేకపోయాడు. ఇటీవల నాగశౌర్యకు కొన్ని పరాజయాలు ఎదురయ్యాయి. ఇదిలా ఉండగా తాజాగా నాగశౌర్యకు ఓ క్రేజీ ఛాన్స్ చేజారినట్లు వార్తలు వస్తున్నాయి. స్టార్ డైరెక్టర్ సుకుమార్ కేవలం దర్శకుడిగా మాత్రమే కాక నిర్మాతగా కూడా కొన్ని చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
సుకుమార్ నిర్మాణంలో నాగశౌర్య ఓ చిత్రంలో నటించాల్సింది. ఆ చిత్రం ఆగిపోయినట్లు ఇటీవల్ ప్రచారం జరిగింది. తాజాగా మరో వార్త వెలుగులోకి వచ్చింది. భవ్య క్రియేషన్స్ నిర్మాణంలో ఆనంద్ ప్రసాద్ దర్శకత్వంలో నాగ శౌర్య చిత్రానికి సన్నాహకాలు జరుగుతున్నాయి. ఆ చిత్రం కూడా ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఇలా వరుసగా చిత్రాలు చేజారడం నాగశౌర్యకు నిరాశల కలిగించే అంశమే. ఇదిలా ఉండగా నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సమంత ఓబేబి చిత్రంలో నాగ శౌర్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద, ఛలో లాంటి హిట్ చిత్రాలు నాగ శౌర్య సొంతం.


Click it and Unblock the Notifications











