వామ్మో నాగశౌర్య మామూలోడు కాదు.. వర్కౌట్స్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!!

యంగ్ హీరో నాగశౌర్య ఈ మధ్య బాగానే హల్చల్ చేశాడు. తన కొత్త సినిమా పోస్టర్, ఫస్ట్ లుక్‌తో సోషల్ మీడియాలో సునామీని సృష్టించాడు. కెరీర్‌లో 20వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం భారీ స్థాయిలో కష్టపడుతున్నాడు. చాక్లెట్ బాయ్‌లా ఉండే నాగశౌర్య అశ్వథ్థామ మాస్ లుక్‌లో దర్శనమిచ్చాడు. ఆ సినిమా అంతగా వర్కౌట్ కాకపోయినా నాగశౌర్య లుక్‌కు మాత్రం మంచి పేరే వచ్చింది. ఇక తన 20వ చిత్రం కోసం శరీరాకృతిని పూర్తిగా మార్చేస్తున్నాడు.

స్పోర్ట్స్ డ్రామా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం కోసం ఏకంగా పది పలకల దేహాన్ని ట్రై చేస్తున్నాడు. ఏకంగా టెన్ ప్యాక్స్ కోసం ట్రై చేస్తుండటంలో అందరూ ఆశ్చర్య పోతున్నారు. ఈ మధ్య నాగ శౌర్య ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ తన ఫిట్నెస్ రహస్యాలు తెలిపాడు. ఇప్పటికే 8 ప్యాక్స్ వచ్చాయని, మిగిలిన వాటి కోసం ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పుకొచ్చాడు.

 Naga Shaurya Latest Pic Goes Viral

ఇక తాజాగా నాగశౌర్య జిమ్‌లో వర్కౌట్లు చేస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో బయటకు వచ్చింది. ఇక ఈ ఫోటోలో లవర్ బాయ్ కాస్త యాక్షన్ హీరోగా మారినట్టు కనిపిస్తోంది. రెండు డంబెల్స్‌తో నాగశౌర్య చేస్తోన్న వర్కౌట్లకు సంబంధించిన ఫోటో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. రామ్ రెడ్డి కెమెరామెన్‌గా పని చేస్తున్నాడు. కాల భైరవ సంగీతాన్ని అందిస్తుండగా.. జునైడ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహించనున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X