బాడీ బిల్డ్ చేసిన యువ హీరో నాగ శౌర్య.. న్యూ లుక్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

టాలీవుడ్ లో నేటితరం యువ హీరోల మధ్య పోటీ గట్టిగానే పెరుగుతోంది. స్టార్ హీరోలు చాలా వారకు వారి క్రేజ్ తోనే సినిమాలకు హైప్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇక యువ హీరోలు మాత్రం కొత్తగా ట్రై చేస్తేగాని ఆడియెన్స్ దృష్టిని వారి వైపు తిప్పుకోవడం లేదు. నాగ శౌర్య కూడా అదే తరహాలో ఒక్కసారిగా జనాలు తనవైపుకు చూసేలా బాడీ బిల్డ్ చేశాడు. అతను పోస్ట్ చేసిన వర్కౌట్ వీడియో కూడా వైరల్ అవుతోంది.

 సరికొత్తగా కనిపించాలని..

సరికొత్తగా కనిపించాలని..

లాక్ డౌన్, కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్స్ కి దూరంగా ఉన్న నాగ శౌర్య ఈ గ్యాప్ లోనే ఒక గోల్ సెట్ చేసుకున్నాడు. దాదాపు ఆ గోల్ ని చేరుకున్నాడు కూడా. సొంతంగా ఇంట్లోనే ఒక జిమ్ సెంటర్ ని రెడీ చేసుకొని వర్కౌట్స్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎలాగైనా నెక్స్ట్ సినిమాతో ఆడియేన్స్ రెగ్యులర్ గా కాకుండా సరికొత్తగా కనిపించాలని చాలానే కష్టపడ్డాడు.

గతంలో ఎప్పుడు లేని విధంగా..

గతంలో ఎప్పుడు లేని విధంగా..

ఇక మొత్తానికి ఇటీవల ఒక స్పెషల్ వర్కౌట్ వీడియోను పోస్ట్ చేశాడు. కష్టమైన వర్కౌట్ ని నాగ శౌర్య చాలా ఈజీగా కొట్టేస్తున్నాడు. ఫేస్ చూపించకుండా కేవలం బ్యాక్ మాత్రమే చూపించి మరింత హైప్ క్రియేట్ చేశాడు. దీంతో నెటీజన్స్ అతని ఫ్రంట్ లుక్ ని కూడా చూడాలని కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా నాగ శౌర్య గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక సరికొత్త లుక్ తో రెడీ అవుతున్నాడని తెలుస్తోంది.

మాస్ ఆడియెన్స్ ని ఆకట్టుకోవాలని..

మాస్ ఆడియెన్స్ ని ఆకట్టుకోవాలని..

ఎక్కువగా లవ్ స్టోరీలతో ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గరయ్యేలా సినిమాలు చేసిన నాగ శౌర్య అప్పుడప్పుడు మాస్ ఆడియెన్స్ ని ఆకట్టుకోవాలని ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు. ఆ మధ్య ఛలో సినిమాతో సాలీడ్ హిట్ దక్కడంతో కాస్త స్టైల్ ని మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. రెగ్యులర్ లుక్ లో కాకుండా సినిమా సినిమాకు తన పాత్ర ప్రజెంటేషన్ ని కూడా మార్చాలని అనుకుంటున్నాడు.

Recommended Video

'Love Story' Movie Bags A Whopping Non-Theatrical Deal
మరొక సినిమా కోసం..

మరొక సినిమా కోసం..

ఇప్పటికే అశ్వద్దామ సినిమాలో మంచి ఫిట్నెస్ తో కనిపించిన విషయం తెలిసిందే. అలాగే మరొక సినిమా కోసం మరింత కష్టపడుతున్నాడు. అలసిపోతే ఆపను, అనుకున్నది పూర్తయితేనే అపుతాను అంటూ మంచి కొటేషన్ ఇచ్చి వర్కౌట్స్ విడియో పోస్ట్ చేశాడు. ఇక నెక్స్ట్ సుకుమార్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే మరో రెండు సినిమాల కోసం కూడా ఈ హీరో సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X