జిమ్‌లో తెగ కష్టపడిపోతున్నాడు.. నాగశౌర్య పిక్ వైరల్

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ప్రస్తుతం కొత్త జానర్లలో చిత్రాలను చేసి ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో అశ్వథ్థామ అనే విభిన్న చిత్రంతో పలకరించాడు. అయితే ఈ సినిమా అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. కొత్తగా ప్రయత్నించాడు. బాగానే చేశాడు. అనే పేరు వచ్చింది కానీ బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా మెప్పించలేకపోయింది. దీంతో ఈసారి ప్రేక్షకులను ఎలాగైనా సరే మెస్మరైజ్ చేసేందుకు అన్ని విధాలుగా సంసిద్దుడై వస్తున్నాడు. అందులో భాగంగా శరీరాకృతిని మార్చే ప్రయత్నంలో పడ్డాడు.

అందుకు తగ్గట్టు దొరికిన ఈ లాక్‌డౌన్ సమయాన్ని ఎంతో చక్కగా వినియోగించుకున్నాడు. లాక్‌డౌన్ ఉన్నంత కాలం ఇంట్లోనే ఉంటూ టెన్ ప్యాక్స్ కోసం ట్రై చేశాడట. ఎవ్వరినీ కలవకుండా, ఎలాంటి కథలు వినకుండా పది పలకల దేహం కోసం శ్రమించాడట. దీనికోసం ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చిందని, ఫుడ్ కంట్రోల్ చేసుకోవాల్సి వచ్చిందని తన బాధలన్నీ వివరించాడు. కథ చెప్పినప్పుడు దర్శకుడు లుక్, బాడీ గురించి ఎలాంటివి చెప్పలేదని, తానే ఇలా బాడీని మార్చాలని అనుకున్నట్టు తెలిపాడు.

Naga Shaurya New Pic While Doing Workout

ఇక ప్రస్తుతం అందరూ సెట్స్ పైకి వెళ్లి షూటింగ్‌లు చేసేందుకు రెడీ అవుతున్నారు. అందుకే ఇంకా కసరత్తులు పెంచి రెడీ అవుతున్నాడు. ఇండియాలోనే మొట్టమొదటి సారిగా ఆర్చరీ (విలు విద్య)పై వస్తోన్న చిత్రంగా ఇది రికార్డులకెక్కనుంది. ఈ సినిమాను సంతోష్ జాగర్లపూడి తెరకెక్కిస్తున్నాడు. రామ్ రెడ్డి కెమెరామెన్‌గా పని చేస్తున్నాడు. కాల భైరవ సంగీతాన్ని అందిస్తుండగా.. జునైడ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహించనున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X