నాగ శౌర్య షాకింగ్ లుక్.. సినిమా కోసం అంతలా మారిపోయాడా?

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య టాలెంట్ గురించి అందరికీ తెలిసింది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో పక్కింటి కుర్రాడిలా కనిపించి అందర్నీ మెప్పించాడు. కమర్షియల్ చిత్రాలతో పాటు, ఎమోషన్, కంటెంట్ ఉండే చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దిక్కులు చూడకు రామయ్య, జ్యో అచ్యుతానంద, ఛలో వంటి మంచి సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే గతంలో మాధిరి హిట్ సినిమాలు లేక రేసులో కాస్త వెనకబడ్డాడు.

ఛలో సినిమాతో సొంత నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్‌ను ప్రారంభించాడు. ఛలో సినిమా భారీ హిట్ కావడంతో లాభాలు బాగానే వచ్చాయి. అయితే ఆపై నిర్మించిన నర్తనశాల బోల్తా కొట్టింది. ఆ సినిమా నిర్మాణ పరంగానూ నాగశౌర్యకు పెద్ద దెబ్బ పడింది. చివరగా అశ్వథ్థామ చిత్రాన్ని తెరకెక్కించారు.ఈ సినిమా కోసం నాగశౌర్య కూడా భారీగానే కష్టపడ్డాడు. కండలు పెంచి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. కానీ సినిమా మాత్రం మిశ్రమ ఫలితాన్ని ఇచ్చింది.

 Naga Shaurya NS 20 First Look Goes Viral

ప్రస్తుతం నాగ శౌర్య నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్‌లో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా ప్రాచీన క్రీడా నేపథ్యంలో తెరకెక్కబోతోన్నట్టు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లుక్‌ను విడుదల చేశారు. ఇందులో నాగశౌర్య ఓ రేంజ్‌లో ఉన్నాడు. కండలు తిరిగిన దేహం, బ్యాక్ సైడ్ లుక్ అన్నీ అదిరిపోయాయి. ఈ సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. రామ్ రెడ్డి కెమెరామెన్‌గా పని చేస్తున్నాడు. కాల భైరవ సంగీతాన్ని అందిస్తుండగా.. జునైడ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహించనున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X