సుకుమార్ దర్శకత్వంలో నాగశౌర్య.. సమంతతో కలిసి!
యువ హీరో నాగశౌర్య టాలీవుడ్‌లో భారీ సక్సెస్‌లు సాధించి తన రేంజ్ పెంచుకొన్నారు. ఇటీవల కాలంలో నాగశౌర్య నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచినా.. ఆయన నటన మాత్రం ఆకట్టుకొన్నది. తాజాగా మహిళా దర్శకురాలు నందినీరెడ్డి చిత్రంలో నటిస్తున్నారు. నాగశౌర్య సరసన సమంత అక్కినేని నటించడం గమనార్హం.
నందినీరెడ్డి చిత్రంలో నటిస్తూనే మరోపక్క సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్‌తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సుకుమార్ ఇటీవలే ఓ కథను పూర్తి చేసి నాగశౌర్యకు వినిపించారట. సుకుమార్ చెప్పిన కథ నచ్చడంతో నాగశౌర్య ఒప్పేసుకొన్నారు. ఈ సినిమాకు సుకుమార్ నిర్మాతగా మారడం విశేషం. సుకుమార్ వద్ద పనిచేసిన సహాయ దర్శకుల్లో ఒకరు సినిమాకు దర్శకత్వం వహిస్తారు.

గత రెండు చిత్రాలకు పనిచేసిన దర్శకులకు నాగశౌర్య స్వేచ్ఛ ఇచ్చారు. కథలో గానీ, దర్శకుడి పనిలో గానీ ఎలాంటి జోక్యం కలిగించుకోలేదు. అయితే ఆ రెండు సినిమాలు పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాలపైనే నాగశౌర్య ఆశలు పెంచుకొన్నారు అని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications











