Jr NTR ఫ్యాన్ అనుమానాస్పద మృతిపై..నాగశౌర్య ఎమోషనల్ కామెంట్స్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ మరణం అనేక వివాదాలకు దారి తీసింది. నిరుద్యోగి శ్యామ్ ఆత్మహత్య చేసుకోవడంపై అనేక భిన్నాభిప్రాయాలు వినిపించాయి. శ్యామ్ మరణంపై అనేక ఆరోపణలు, ఊహాగానాలు సోషల్ మీడియాలో కనిపించాయి. రకరకాల వివాదాల మధ్య శ్యామ్ మరణం సంచలనంగా మారింది. శ్యామ్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. అయితే ఎన్టీఆర్ అభిమాని మృతి, దానిపై నాగశౌర్య ఎలా స్పందించారనే విషయంలోకి వెళితే...
ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ మేడిశెట్టి మరణం ఆత్మహత్య కాదు.. హత్య అంటూ సోషల్ మీడియాలో అనేక కామెంట్లు వినిపించాయి. ఈ ఘటనపై వాస్తవాలు బయటకు తీసుకురావాలని చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ఎంపీ రఘురామకృష్ణ రాజు ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ వివాదాస్పద అంశంపై నాగశౌర్య స్పందించారు.
శ్యామ్ మరణం సూసైడ్. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు. నిరుద్యోగంతో బాధపడుతూ శ్యామ్ మరణించారు. శ్యామ్ మృతి వ్యవహారాన్ని రాజకీయాలు చేయవద్దు. చంద్రబాబు, లోకేష్ శవ రాజకీయాలు చేయవద్దు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.
రంగబలి సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మీడియాతో నాగశౌర్య మాట్లాడుతూ..లవ్ మ్యాటర్‌లో నేనేమీ సాధించలేదని తారక్ అన్న ఫ్యాన్ సూసైడ్ చేసుకొన్నారు. అది చాలా తప్పు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అని నాగశౌర్య అన్నారు.

రంగబలి సినిమా విషయానికి వస్తే.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించగా నూతన దర్శకుడు పవన్ సీహెచ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో యుక్తి తరేజా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో షైన్ టామ్ చాకో విన్‌గా నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











