మార్నింగ్ కాఫీ నుంచి నిద్రపోయే వరకు.. అదే లోకమంటోన్న యంగ్ హీరో
యంగ్ హీరో నాగశౌర్య సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉంటాడన్న సంగతి తెలిసిందే. చాలా తక్కువగా పోస్ట్‌లు చేస్తూ ఉంటాడు. వెండితెరపై కనిపించేంత యాక్టివ్‌గా బయట ఉండడు. తన పని ఏదో, తన లోకమే వేరన్నట్టుగా ఉంటాడు. ఈ మధ్య తీసిని సినిమా సరిగా ఆడకపోయినా నాగశౌర్యకు మంచి పేరే వచ్చింది. సొంత నిర్మాణ సంస్థలో తీసిన చిత్రాలు బెడిసి కొడుతుండటంతో కాసింత నిరాశ చెందినట్టు తెలుస్తోంది.
ఛలో సినిమాతో సొంత నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్‌ను స్థాపించి సక్సెస్ కొట్టాడు. ఆపై అదే బ్యానర్‌లో నర్తనశాల, అశ్వథ్థామ వంటి చిత్రాలను నిర్మించి బోల్తా పడ్డాడు. అయితే అశ్వథ్థామ చిత్రం కమర్షియల్‌గా వర్కౌట్ కాకపోయినా.. మంచి ప్రయత్నంగా నిలిచింది. ప్రస్తుతం నాగశౌర్య లాక్ డౌన్ కారణంగా ఇంటి పట్టునే ఉంటున్నాడు. లాక్ డౌన్ సమయంలో కుటుంబంతో చక్కటి సమయాన్ని గడిపాడు.

అమ్మ దగ్గర ఆవకాయ్ పెట్టడం నేర్చుకున్నాడు. ఆవకాయ్ పెడుతున్న వీడియోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. తాజాగా మరో క్యూట్ వీడియోను షేర్ చేశాడు. తన పెంపుడు కుక్కతో ఉన్న అనుబంధాన్ని వివరించాడు. తన పెట్(బూ)తో ఉన్న బంధానికి ఏడాది పూర్తయిందని, ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు అదే లోకమని, ఎంతో ప్రేమ అని నాగశౌర్య ఓ వీడియోను షేర్ చేశాడు.


Click it and Unblock the Notifications











