For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వరుణ్ తేజ్ పెళ్లిపై నాగబాబు షాకింగ్ ఆన్సర్: అతడి మీదకే నెట్టేస్తూ ఊహించని విధంగా!

  |

  మెగా కాంపౌండ్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న హీరో వరుణ్ తేజ్. 'ముకుంద' అనే సినిమాతో తన ప్రయాణాన్ని ప్రారంభించిన మెగా ప్రిన్స్.. తన రెండో సినిమాతోనే జాతీయ స్థాయిలో గుర్తింపును అందుకున్నాడు. ఆ తర్వాత పలు పరాజయాలు ఎదురవడంతో కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక, అప్పటి నుంచి సినిమా సినిమాకు వైవిధ్యాన్ని చూపిస్తూ దూసుకుపోతున్నాడు. తద్వారా ఎన్నో విజయాలు ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉండగా.. కొద్ది రోజులుగా వరుణ్ తేజ్ పెళ్లిపై ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై నాగబాబు స్పందించారు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  వరుస విజయాలతో ఫుల్ ఫామ్

  వరుస విజయాలతో ఫుల్ ఫామ్

  'ముకుంద'తో నిరాశ పరిచినా.. ఆ తర్వాత వచ్చిన 'కంచె'తో జాతీయ అవార్డును అందుకున్నాడు వరుణ్ తేజ్. అప్పటి నుంచి కథ ఎంపికలో ప్రత్యేకతను చూపిస్తూ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటున్నాడు. అందుకే సుదీర్ఘమైన కెరీర్‌లో 'ఫిదా', 'తొలిప్రేమ', 'అంతరిక్షం', 'F2', 'గద్దలకొండ గణేష్' వంటి వరుస విజయాలను అందుకుని ఫామ్‌లో ఉన్నాడు.

  Sonam Kapoor Pregnant: తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్.. భర్త మీద పడుకుని.. హాట్ ఫొటోను వదిలి!

  మల్టీస్టారర్ మూవీతో మరోసారి

  మల్టీస్టారర్ మూవీతో మరోసారి

  ప్రస్తుతం వరుణ్ తేజ్ 'F3' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కొన్నేళ్ల క్రితం విడుదలైన 'F2'కు ఇది రీమేక్‌గా రూపొందుతోంది. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా నటిస్తున్నారు. తమన్నా భాటియా, మెహ్రీన్ హీరోయిన్లుగా చేస్తోన్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీ మే 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

  గనిగా రాబోతున్న వరుణ్ తేజ్

  గనిగా రాబోతున్న వరుణ్ తేజ్

  కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటిస్తోన్న చిత్రమే 'గని'. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. థమన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది.

  స్విమ్‌సూట్‌తో షాకిచ్చిన కాజల్: ప్రెగ్నెంట్ అయినా అందాలు ఆరబోస్తూ ఘాటుగా!

  అప్పట్లో నాగబాబు అలా చెప్పి

  అప్పట్లో నాగబాబు అలా చెప్పి

  కొన్ని నెలల క్రితం నాగబాబు ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ వివాహంపై ఆయన తొలిసారి స్పందించారు. 'మేము వరుణ్ బాబుకు సంబంధాలు చూస్తున్నాం. వాడు మాత్రం ఇప్పుడే వద్దంటున్నాడు. ఒకవేళ చేసుకున్నా బయటి విషయాలపై స్పందిస్తూ, ప్రొఫెషనల్‌గా ఉండే అమ్మాయి కావాలి అంటున్నాడు' అని ఆయన చెప్పారు.

  వరుణ్ తేజ్ పెళ్లిపై ప్రచారం

  వరుణ్ తేజ్ పెళ్లిపై ప్రచారం

  వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు వరుణ్ తేజ్. ఇలాంటి సమయంలోనే అతడి పర్సనల్ లైఫ్ గురించి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే అతడికి వివాహం జరగబోతుందని ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే అతడు ఓ హీరోయిన్‌ను పెళ్లాడబోతున్నాడని కూడా టాక్ వినిపిస్తోంది. దీంతో వరుణ్ పేరు మారుమ్రోగుతోంది.

  బీచ్‌లో బికినీతో శ్రీయ శరణ్ అందాల విందు: తల్లైన తర్వాత తొలిసారి ఇంత దారుణంగా!

  వరుణ్ పెళ్లిపై మరోసారి ప్రశ్న

  వరుణ్ పెళ్లిపై మరోసారి ప్రశ్న

  షోలు, రాజకీయాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు నాగబాబు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫాలోవర్లతో లైవ్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నెటిజన్లు ఎన్నో రకాల ప్రశ్నలు అడిగారు. వీటన్నింటికీ సామాన్యుడిలానే జవాబులు ఇస్తూ ఆకట్టుకున్నారు మెగా బ్రదర్. ఈ సందర్భంగా ఓ నెటిజన్.. వరుణ్ తేజ్ పెళ్లి గురించి ఆయనను ప్రశ్నించాడు.

  Recommended Video

  RRR Team Reacts On Memes పడి పడి నవ్విన Ram Charan, Jr NTR | Filmibeat Telugu
  అతడి మీదకు నెట్టేస్తూ రిప్లై

  అతడి మీదకు నెట్టేస్తూ రిప్లై

  తాజాగా జరిగిన సెషన్‌లో ఓ నెటిజన్ 'వరుణ్ తేజ్ పెళ్లి ఎప్పుడు బ్రదర్' అని నాగబాబును ప్రశ్నించాడు. అయితే, గతంలో మాదిరిగా ఆయన ఆన్సర్ చేయలేదు. దీనికి వరుణ్ తేజ్ పేరును ట్యాగ్ చేస్తూ ఊహించని విధంగా 'వాళ్లకు సమాధానం చెప్పు' అని క్యాప్షన్ పెట్టాడు. దీంతో అంతా వరుణ్ చేతిలోనే ఉందని పరోక్షంగా వెల్లడించారు. ఇప్పుడిది హాట్ టాపిక్ అయిపోతోంది.

  English summary
  Mega Brother Nagababu Very Active in Social Media. Recently He Did Comments on His Son Varun Tej Marriage.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X