Naga Chaitanya ఇన్నాళ్లకు గుడ్ న్యూస్ చెప్పిన నాగచైతన్య... మరో 2 రోజుల్లోనే..!

అక్కినేని హీరో నాగచైతన్య గత కొంత కాలంగా హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. చైతూకు సరైన హిట్ పడి చాలా కాలమే అయింది. ఓటీటీలో దూత సిరీస్ తో సక్సెస్ అందుకున్నప్పటికీ.. థియేటర్లలో హిట్ పడక చాలా కాలమేఅయింది. ఇక ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. మరోసారి ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా.. మరో గుడ్ న్యూస్ చెప్పాడు చైతూ. ఆ వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం.

జోష్ సినిమాతో అక్కినేని వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు నాగచైతన్య. ఆ తర్వాత ఏ మాయ చేశావే సినిమాతో అమ్మాయిల మనసును కొల్లగొట్టాడు. ఇక సమంత ప్రేమలో పడిపోయి.. పెళ్లి చేసుకున్నారు. ఏమైందో తెలియదు ఈ జంట వీడిపోతున్నట్లు ప్రకటించారు. ఇక విడాకుల తర్వాత నాగచైతన్య, సమంత ఎవరి పనుల్లో వారు బిజీగా మారిపోయారు. విడాకుల తర్వాత సమంత క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

NagaChaitanya Confirmed Dhootha Series Sequel March 19th Officially Announce

మరోవైపు చైతూకు సమంతతో విడాకుల తర్వాత సరైన హిట్ పడలేదు. సాలిడ్ హిట్ పడక చాలా కాలమే అయింది. ఇక ఇటీవల ఓటీటీలో దూత వెబ్ సిరీసుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సిరీసుకు మనం, 24 వంటి సైన్స్ ఫిక్షన్ చిత్రాలు తెరకెక్కించిన విక్రమ్ కుమార్ కే దర్శకత్వం వహించాడు. తొలిసారి ఓటీటీలో సిరీసులో నాగచైతన్య హీరోగా నటించాడు. ధూత సిరీసుతో నాగచైతన్యకు మంచి హిట్ లభించింది.

ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమాను నిర్మించింది. ఇక డిసెంబర్ 1నుంచి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లో స్ట్రీమింగ్ అయ్యింది. అయితే గత ఏడాది రిలీజ్ అయిన ధూత ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంది. పలు దేశాల్లో ఈ సిరీసుకు మంచి రెస్పాన్స్ లభించింది. 4నాలుగు నెలలు దాటినా ఇప్పటికీ ఓటీటీలో ట్రెండింగ్ వెబ్ సిరీసుగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ధూత ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు చైతూ.

ధూత వెబ్ సిరీస్ విడుదలకు ముందు, ప్రేక్షకులకు నచ్చితే, ధూత 2 సీక్వెల్ తీయాలని ఆలోచిస్తామని నాగ చైతన్య పేర్కొన్నాడు. సిరీస్ పార్ట్ 1 డిసెంబర్‌లో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయింది. ఇది తెలుగులో అత్యుత్తమ వెబ్ సిరీస్‌లలో ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్‌లో 8 ఎపిసోడ్‌లు ఉన్నాయి. ఇది ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. దర్శకుడు విక్రమ్ కుమార్ సమాజానికి సంబంధించిన ముఖ్యమైన సందేశాలతో సస్పెన్స్‌ని మిళితం చేసి అద్భుతంగా తెరకెక్కించాడని ప్రశంసలు కురిపించారు సినీ లవర్స్.

NagaChaitanya Confirmed Dhootha Series Sequel March 19th Officially Announce

వెబ్ సిరీస్ ప్రైమ్ వీడియోలో నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఇప్పుడు పార్ట్ 2 ఎనౌన్స్‌మెంట్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. మార్చి 19న దీని గురించిన వార్తలు వచ్చే అవకాశం ఉందని నాగ చైతన్య హింట్ ఇచ్చాడు. మార్చి 19న ధూత 2 ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో చైతూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X