HBD Nagarjuna: ప్యూర్ మాస్ లుక్‌లో నాగార్జున... మరో కొత్త దర్శకుడితో కలిసి సంక్రాంతికి బరిలోకి!

టాలీవుడ్ కింగ్ నాగార్జున పుట్టినరోజు నేడు. ఇక ఆయన 64 ఏళ్లు వచ్చినా.. ఇంకా అదే అందం, మన్మధుడిలా ఉండిపోయారు. అటు ఆరోగ్యం, బాడీని మెయింటైన్ చేస్తూ... కుర్ర హీరోలకు గట్టిపోటీస్తున్నాడు. అయితే ఇప్పటికే నాగార్జున... సినిమా ఇండస్ట్రీలో 98సినిమాలతో అలరించగా... ఇప్పుడు 99వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈరోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా సినిమా టైటిల్, గ్లింప్స్ వదిలారు మేకర్స్.

టాలీవుడ్ మన్మధుడు నాగార్జున పుట్టినరోజు నేడు. ఇక ఆయన బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు ఆయన బర్త్ డే సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు విషెష్ చెబుతున్నారు. నాగార్జునకు 64 ఏళ్ళు వచ్చినా ఇంకా అంతే అందంగా, ఆరోగ్యంగా ఉంటూ, బాడీని మెయింటైన్ చేస్తూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 98 సినిమాలతో మెప్పించిన నాగ్... వందకు మరో రెండు అడుగుల దూరంలో ఉన్నారు

Nagarjuna 99 Movie Naa Saami Ranga Announced And Glimpse Released This Movie Releasing on Sankranti 2024

గత కొంత కాలంగా బాక్సాఫీస్ వద్ద నాగార్జున డీలా పడిపోయాడు అని చెప్పవచ్చు. ఆయన తోటి హీరోలంతా సినిమాలు చేసుకుంటూ.. కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తున్నారు. ఈయన సంగతి వచ్చేసరికి... హిట్ కొడితే బ్రేక్ ఇవ్వడానికి అభిమానులు సిద్ధంగా ఉన్నా... ఆయన సినిమాలు తీయడమే మానేశారు. దాదాపు వన్ ఇయర్ తర్వాత ఆయన సినిమా అప్డేట్ వచ్చింది. నాగార్జున గత సంవత్సరం ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకులని పలకరించాడు. ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది.

Nagarjuna 99 Movie Naa Saami Ranga Announced And Glimpse Released This Movie Releasing on Sankranti 2024

నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు ఆగస్టు 29న నాగ్ 99వ సినిమాని ప్రకటించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నాగార్జున 99వ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే నాగ్ తన కెరీర్ లో ఎంతో మంది కొత్త డైరెక్టర్స్ ని ప్రకటించగా ఇప్పుడు ఈ సినిమాతో మరో కొత్త డైరెక్టర్ ని పరిచయం చేస్తున్నాడు. విజయ్ బిన్నీ అనే కొత్త దర్శకుడు నాగార్జున 99వ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

Nagarjuna 99 Movie Naa Saami Ranga Announced And Glimpse Released This Movie Releasing on Sankranti 2024

అయితే విజయ్ బిన్ని తొలుత కొరియోగ్రాఫర్. ఇప్పుడు ఆయన నాగార్జున సినిమాతో మెగాఫోన్ పట్టి దర్శకుడిగా మారారు. ఈరోజు 'నా సామిరంగ' అనే సరికొత్త సినిమా టైటిల్ ని ప్రకటించారు మేకర్స్. టైటిల్ తో పాటు చిన్న గ్లింప్స్ కూడా రిలీజ్ చేసి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు. గ్లింప్స్ లో నాగార్జున ని లుంగీ కట్టించి, బీడీ కాలుస్తూ మాస్ రోల్ లో చూపించారు. ఈ పండక్కి నా సామిరంగ అంటూ నాగార్జున అదరగొట్టారు.

ఇక ఈ సంక్రాంతికి ఇప్పటికే ప్రశాంత్ వర్మ, తేజ హనుమాన్ పాన్ ఇండియా మూవీ, రవితేజ టైగర్ నాగేశ్వరరావు పాన్ ఇండియా మూవీలతో పాటు.. మహేశ్ గుంటూరు కారం సినిమా రిలీజ్ కానున్నాయి. ఇప్పుడు ఈ లిస్టులో నాగార్జున వచ్చి చేరారు. ఇక సంక్రాంతి ఫైట్ మామూలుగా ఉండదని అర్ధం అవుతుంది. మరి ఇందులో ఎవరూ పై చేయి సాధిస్తారో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X