100వ సినిమాపై క్లారిటీ ఇచ్చిన అక్కినేని నాగార్జున.. మల్టీస్టారర్ మూవీగా బిగ్గెస్ట్ ప్లాన్..
ఒక జనరేషన్ లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్స్ మధ్య పోటీ ఏ రేంజ్ లో ఉండేదో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఒకరిని మించి మరొకరు హిట్స్ అందుకునేవారు. ఇప్పటికి కూడా ఈ అగ్ర హీరోలు వారి స్టైల్ లోనే ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా నాగార్జున కాలానికి అనుగుణంగా మారుతూ డిఫరెంట్ సినిమాలు చేస్తున్నారు. ఇక త్వరలోనే 100వ సినిమా కూడా స్టార్ట్ చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు.

నాగార్జున కూడా
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాలను పూర్తి చేసుకోగా బాలకృష్ణ కూడా 100వ సినిమాగా గౌతమి పుత్ర శతకర్ణి లాంటి సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడు. ఇక నాగార్జున కెరీర్ లో కూడా ఆ స్పెషల్ మార్క్ నెంబర్ రావడానికి ఎంతో సమయం లేదు. మరికొన్ని సినిమాలు చేస్తే సెంచరి కొట్టేస్తారట.

100వ సినిమా కోసం స్పెషల్ ప్లాన్
ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా నాగార్జున తన 100వ సినిమాపై ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. ఈ శుక్రవారం నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా మీడియాతో మాట్లాడిన నాగార్జున తన భవిష్యత్తు సినిమాలపై స్పందించారు. 100వ సినిమా ఖచ్చితంగా స్పెషల్ గా ఉంటుందని చెప్పారు.

నెక్స్ట్ ఆ రెండు సినిమాలతో
వైల్డ్ డాగ్ అనంతరం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే. అలాగే తనకు కెరీర్ కు బెస్ట్ హిట్ ఇచ్చిన సోగ్గాడే చిన్న నాయనా దర్శకుడితోనే మరో సినిమా చేయబోతున్న నాగార్జున ఆ సినిమాకు బంగార్రాజు అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసుకున్నాడు.

కొడుకుతో మల్టీస్టారర్
ఇక త్వరలో ఒక మల్టీస్టారర్ ప్రాజెక్ట్ కూడా ఉంటుందని చెబుతూ కచ్చితంగా అది తన 100వ సినిమాగా తెరక్కుతుందని నాగ్ వివరణ ఇచ్చారు. అందులో అఖిల్ లేదా నాగ చైతన్య మరొక హీరోగా కనిపిస్తారని అంటూ స్క్రిప్ట్ పూర్తిగా సిద్ధమైన తరువాతే ఎనౌన్స్మెంట్ ఉంటుందని అన్నారు. అలాగే రెండు వెబ్ సిరీస్ లను కూడా చేయబోతున్నట్లు నాగార్జున క్లారిటీ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











